28 ఏళ్ల తరువాత.. తొలిసారి | Swiss Women Strike For Right To Equality | Sakshi
Sakshi News home page

28 ఏళ్ల తరువాత.. తొలిసారి ఉద్యమం

Jun 14 2019 5:00 PM | Updated on Jun 14 2019 5:11 PM

Swiss Women Strike For Right To Equality - Sakshi

బెర్న్‌: మనదేశంలోనే కాదు దాదాపు ప్రపంచమంతా మహిళలపై అనేక రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమెరికా, నార్వే, స్కాండినేవియన్‌ వంటి దేశాల్లో మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని దేశాలు మాత్రం కల్పించలేకపోతున్నాయి. మహిళల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదోఒక ఉద్యమం సాగుతునే ఉంటుంది. తాజాగా తామకు సమాన హక్కులు కల్పించాలని కోరుతూ.. స్విట్జర్లాంట్‌లో మహిళలు ఆందోళన బాట పడ్డారు. గత రెండు రోజుల నుంచి లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పనికి సామానవేతనం కల్పించాలని, పురుషులతో సమానంగా హక్కుల్లో ప్రాధాన్యం కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా 28 ఏళ్ల తరువాత ఇంత పెద్దఎత్తున స్విస్‌లో మహిళలు ఉద్యమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత  మహిళలకు ఓటు హక్కు కల్పించాలని మొదటి సారి వారు ఆందోళన బాటి పట్టారు. దీనికి ప్రతిఫలితంగా 1971లో స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం వారికి తొలిసారి ఓటు హక్కును కల్పించింది. అప్పటి వరకు ఆ దేశంలో మహిళకు  ఓటు హక్కులేకపోవడం గమన్హారం.  ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని 1991లో మరోసారి మహిళాలోకం ఆందోళన బాట పట్టింది. వారి డిమాండ్లకు తలొగ్గిన స్విస్‌ ప్రభుత్వం తొలిసారి వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమనిచింది. వారి ఉద్యమ ఫలితమే నేడు ఆదేశ మంత్రిమండలిలో ఎనిమిది మంది మహిళా మంత్రులకు అవకాశం కల్పించింది.

కాగా తాజాగా వేతంలో తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. పురుషులతో పోల్చుకుంటే 20శాతం తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని, మరికొన్ని అంశాల్లో తమకు పూర్తి స్వేచ్చను కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనికి ఆదేశ పలువురు మహిళా ప్రముఖులు పూర్తి మద్దతును ప్రకటించారు. 1991 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకుంటామని అప్పటి ఉద్యమంలో పాల్గొన్నవారు చెపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement