![Electrical short circuit in Uravakonda 8 lakhs currency Burnt - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/22/cur.jpg.webp?itok=9PuZtSH5)
మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది.. కాలిపోయిన నోట్ల కట్టలు
సాక్షి, అనంతపురం(ఉరవకొండ): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి రూ. 8 లక్షల నగదు, ఇల్లు దగ్ధమైంది. పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక 10వ వార్డులో నివాసముంటున్న చంద్రనాథ్ పట్టుచీరల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి ఇంటికి తాళం వేసి చంద్రనాథ్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు చెలరేగాయి.
చుట్టుపక్కల వారు గమనించి, సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. అప్పటికే ఇంట్లో విలువైన వస్తు సామగ్రితో పాటు వ్యాపారం కోసం ఉంచిన 50 పట్టు చీరలు, రూ.8 లక్షల నగదు కాలిపోయాయి. రూ.15 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఘటనపై సీఐ హరినాథ్ దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment