
నా పయనం జగన్‌తోనే..
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీలోకి వెళుతున్నట్లు తనపై వస్తున్న వార్తలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై.మధుసూదన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారం క్రితం ఓ పత్రికలో కథనం ప్రచురితమైందని, కొందరు అరకొర సమాచారంతో వార్తలు రాస్తారని వదిలివేశానన్నారు. అయితే మంగళవారం మరో పత్రికలో అలాంటి కథనమే ప్రచురితమైందన్నారు. తాను ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నానని, భవిష్యత్‌లోనూ ఇదే పార్టీలో ఉంటానన్నారు. రాజకీయ జీవితం జగన్‌తోనే సాగుతుందని స్పష్టం చేశారు. అనైతిక, విలువలు లేని రాజకీయాలు తాను చేయనని, వ్యక్తిత్వం ఉన్న మనిషినని పేర్కొన్నారు. తనపై తప్పుడు వార్తలు రాసే వారు తన గురించి పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు.