వైఎస్సార్ ఆసరా.. సీఎం జగన్ ఉరవకొండ పర్యటన అప్‌డేట్స్
►నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు.
12:32 AM, జనవరి 23 2023
ఎంతో సంతోషంగా ఉంది: సీఎం జగన్
- దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోంది
- దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు
- మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నాం
- వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం
- డ్వాక్రా మహిళల ఖాతాల్లో కోట్లు జమ చేశాం
- మహిళలు బాగుంటేనే రాష్ట్రం ముందడుగులో ఉంటుంది
- ఎక్కడా లంచాలు ల్లేవ్.. వివక్షకు చోటు లేదు.. వ్యత్యాసాలు ల్లేవ్.. ఇది రికార్డే
- రాష్ట్రంలో 56 నెలల కాలంలో జరిగిన మంచిపై సంతోష పడుతున్నా
- గతంలో అంతా లంచాల మయం
- ఇప్పుడు ఎక్కడా కులం, మతం, ప్రాంతం, వర్గం.. చివరకు ఏ పార్టీ అని చూడకుండా, ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ప్రామాణికంగా లబ్ధి చేకూరుస్తున్నాం
- పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.4,968 కోట్లు చెల్లించాం
- ఆసరా, సున్నా వడ్డీ కింద రూ.31 వేల కోట్లు అందించాం
- 56 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు రూ.2.53 లక్షల కోట్లు అందించాం
- ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక రికార్డు
- జగనన్న అమ్మఒడి కింద రూ.26,067 కోట్లు అందించాం
- వైఎస్సార్ ఆసరా కింద రూ.25,571 కోట్ల రుణాలు చెల్లించాం
- వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు అందించాం
- గత ప్రభుత్వంలో దోచుకో, పంచుకో, తినుకో
- గతంలో అక్కచెల్లెమ్మలకు ఎందుకు మంచి జరగలేదు?
- అక్కచెల్లెమ్మల కుటుంబాలను పట్టించుకునే పరిస్థితి గతంలో చూశామా?
- 31 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం
- 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి
- ఇళ్లు పూర్తయితే రూ.5 లక్షల విలువైన ఆస్తి వారి చేతుల్లో ఉంటుంది
- డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారు
- చంద్రబాబు మోసాలతో సంఘాల గ్రేడ్లు పడిపోయాయి
- అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మన ప్రభుత్వం అండగా ఉంది
12:12 AM, జనవరి 23 2023
మాకు జగనన్న ఉన్నాడనే భరోసా ఉంది
మాది నిరుపేద కుటుంబం. నాకు ఇద్దరు కొడుకులు. వాళ్లిద్దరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుతున్నారు. ప్రభుత్వాల నుంచి వాళ్లకు లబ్ధి చేకూరుతోంది. నేను రూ.30 వేల లబ్ధి పొంది చిన్నవ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గతంలో లాగా లేదు ఇప్పుడు.. మీరిచ్చిన ధైర్యం మేం మరిచిపోలేం. ఆరోగ్యశ్రీ ద్వారా బేతారి పని చేసే నా భర్త ప్రాణాలు కాపాడుకోగలిగానని భావోద్వేగానికి లోనయ్యారామె. చివర్లో సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్నారామె.
:::మమత.. వజ్రకరూర్ గ్రామం
12:12 AM, జనవరి 23 2023
సీఎం జగన్ చెప్పాడంతే.. చేస్తాడంతే: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
- ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రసంగం
- సీఎం జగన్ పరిపాలనలో అనేక సంస్కరణలు
- సీఎం జగన్ రాష్ట్ర ఆదాయం పెంచేలా నిర్ణయాలు
- మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం జగన్ కృషి
- మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి
- కండువా వేసుకుంటేనే పథకం ఇస్తామన్న పాలన టీడీపీది
- నూటికి 90 శాతం మందికి పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే
- కండువా కప్పుకుంటానంటేనే పథకం ఇస్తానంటే.. మీ పార్టీలో ఎవరూ మిగిలేవారు లేరు
- మేం ప్రజాస్వామ్యవాదులం
- మీలా చేస్తే.. పయ్యావుల కేశవ్ కూడా పార్టీలో ఉండేవాడు కాదు
- పయ్యావుల ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి చేసిందేం లేదు
- ఎన్నికలప్పుడు తప్పా ఎప్పుడూ జనాలకు కనిపించడు
- సీఎం జగన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారు.. అందుకు కృతజ్ఞతలు
- ఉరవకొండకు మరిన్ని సమస్యలు ఉన్నాయ్.. అవి తీర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా
- నాడు వైఎస్సార్ హయాంలో ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం జగన్‌ను కోరుతున్నా
11:49 AM, జనవరి 23 2023
వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం
- ఉరవకొండలో సీఎం జగన్
- వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి హాజరు
- పూల మాలతో వైఎస్సార్‌కు నివాళి
- జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమం ప్రారంభించిన సీఎం జగన్
11:40 AM, జనవరి 23 2023
ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్
- సాదర స్వాగతం నడుమ.. ఉరవకొండ సభాస్థలికి చేరుకున్న సీఎం జగన్
- స్థానిక నేతలతో మాటామంతీ
- అక్కాచెల్లెమ్మల బాగోగులు అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్
- కాసేపట్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం
11:01 AM, జనవరి 23 2023
ఉరవకొండకు చేరుకున్న సీఎం జగన్
- మరికాసేపట్లో వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం జగన్
- ఉరవకొండ బైపాస్ రోడ్డు బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- బహిరంగ సభకు భారీగా హాజరైన డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళలు
- నాలుగు విడతల్లో 25571 కోట్ల రూపాయల రుణాలను చెల్లించిన జగన్ ప్రభుత్వం
- సీఎం జగన్‌కి స్వాగతం పలికిన ఉరవకొండ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, నేతలు
10:06 AM, జనవరి 23 2023
పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్
- శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు
09:25 AM, జనవరి 23 2023
ఉరవకొండ బయల్దేరిన సీఎం జగన్
- అనంతపురం ఉరవకొండ బయల్దేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- కాసేపట్లో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం
- బహిరంగ సభలో ప్రసంగించి.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్
09:15 AM, జనవరి 23 2023
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
- తొలుత ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు
- అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు
- ఆ తర్వాత వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కింద బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు
- కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు
నేడు వైఎస్సార్ ఆసరా పంపిణీ
- నేడు రూ.6,394.83 కోట్ల నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
- 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కార్ భరోసా
- 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు
- ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,175.97 కోట్లు చెల్లింపు
- నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ
- అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రెండు వారాలపాటు ఉత్సవంలా కార్యక్రమాలు
- ప్రజల్లో తనపట్ల ఉన్న విశ్వసనీయత, నమ్మకాన్ని మళ్లీమళ్లీ చాటుకుంటున్న జగన్
- చంద్రబాబు నిర్వాకంతో కుదేలైన సంఘాలన్నీ మళ్లీ గాడిలోకి..
- సర్కారు చర్యలతో పొదుపు సంఘాల ఎన్‌పీఏలు 18.36 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గుదల
56 నెలల్లో మహిళలకు రూ.2,66,772 కోట్ల లబ్ధి..
వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడతగా అందిస్తున్న లబ్ధితో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 56 నెలల కాలంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా కేవలం మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన సాయమే రూ.2,66,772.55 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు.
► మరోవైపు.. ప్రభుత్వం చేసిన లబ్ధి ద్వారా మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లుగా చేసి, వారి జీవనోపాధి మెరుగుపడేలా అదనంగా ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజ సంస్థలైన అమూల్, హిందూస్తాన్ లివర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్‌గుడి, జియాన్, నినె, ఇర్మా, అయేకార్ట్, మహేంద్ర అండ్ ఖేతి వంటి వాటితో పాటు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించే చర్యలు చేపట్టింది.
► అంతేకాక.. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి జగన్ ప్రభుత్వం వారికి అందించిన సహకారంతో ఇప్పటివరకు 14,77,568 మంది మహిళలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7,000 నుండి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
► అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.10 నుండి రూ.22 వరకు అదనపు ఆదాయం పొందుతున్నారు.
► దాదాపు నాలుగు లక్షల మంది మహిళా మార్ట్‌ల ద్వారా లబ్ధిపొందుతున్నారు.
► గత పాలకులు ఒకవైపు రుణాలు మాఫీ చేస్తామని మాటిచ్చి అమలుచేయకపోగా, అక్టోబరు 2016 నుండి సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దుచేయడంతో ‘పొదుపు’ మహిళల అప్పులు చక్రవడ్డీలతో తడిసిమోపెడై మోయలేని భారంగా మారాయి.
► అప్పట్లో సుమారు రూ.3,036 కోట్ల వడ్డీని మహిళలు బ్యాంకులకు అపరాధ వడ్డీ రూపేణా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌లో ఉండే పొదుపు సంఘాలు కూడా ‘సీ’, ‘డి’ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి.
► అనంతరం.. జగన్ ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా‘, ‘వైఎస్సార్ సున్నావడ్డీ’ల ద్వారా లబ్ధిపొందిన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారడంతో ఇప్పుడు అవే పొదుపు సంఘాల ఎన్‌పీఏలు 18.36 శాతం నుండి 0.17 శాతానికి తగ్గాయి.
ఫిబ్రవరి 5 వరకు జిల్లాల్లో ‘ఆసరా’ ఉత్సవాలు..
ఇక వైఎస్సార్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సవాల మాదిరిగా నిర్వహించనున్నారు. అలాగే..
► అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా నియోజకవర్గాల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాలు లేదా మున్సిపల్ వార్డుల చొప్పున లబ్ధిదారులతో సభలు నిర్వహించి, ప్రభుత్వం వారికి చేకూరుస్తున్న లబ్ధిని వివరిస్తారు.
► గత నాలుగున్నరేళ్లలో వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా లబ్ధిపొంది, ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహాయంతో సుస్థిరమైన జీవనోపాధి ఏర్పాటుచేసుకున్న వారి విజయగాధలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు.
► మిగిలిన సభ్యులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకొచ్చే వారికి అధికారులు తగిన సహాయం అందించేలా ఎమ్మెల్యేలు చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
► ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ఏ ప్రాంతంలో ఏ రోజు పర్యటిస్తారో తెలిపే 14 రోజుల ప్రణాళికను అధికారులు ఇప్పటికే సిద్ధంచేశారు.
► ఫిబ్రవరి 5 వరకు రెండు వారాల్లో మొత్తం 7,98,395 సంఘాలకు రూ.6,394.83 కోట్లను జమచేసే ప్రక్రియ పూర్తిచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment