
సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
ఉరవకొండ: ఈనెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉరవకొండ పర్యటనకు వస్తుండటంతో ప్రత్యేక పోలీసు బలగాలతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఉరవకొండ సీఐ చిన్నగౌస్‌తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రావతి డీప్‌కట్ వద్ద మొదట సీఎం చేపట్టే జలహరతి కార్యక్రమం, అనంతరం పైలాన్ ప్రారంభోత్సవం, హంద్రీనీవా వెడల్పు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు స్థలాలను పరిశీలించారు.
అనంతరం ఉరవకొండ ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయిస్తామని ఎస్పీ తెలిపారు.