
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఉరవకొండ: ఉరవకొండలో ఈనెల 8న సీఎం పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్, జేసీ–2 ఖాజమోహిద్దీన్‌లు పరిశీలించారు. పైలాన్ స్థూప నిర్మాణ పనులు, ఇంద్రావతి డీప్‌కట్ జలహరతి పనులు, హెలీప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, వర్షం కారణంగా పనులకు కాస్త ఆటంకం కలిగినా ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు.