ఉరవకొండలో అగ్నిప్రమాదం
Published Mon, Mar 13 2017 12:22 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
- రూ.2 లక్షల ఆస్తి నష్టం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక పాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సమీపంలో నాలుగు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక సెలూన్, సైకిల్ షాపు, హోటల్, కిరాణ దుకాణం దగ్ధమైన సంఘటనలో రూ. 2 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరో గిట్టని వారు ఈ పనికి పాల్పడ్డారని దుకాణ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనతో తాము రోడ్డున పడ్డామని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Advertisement
Advertisement