సీమాంధ్ర ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని, ఈ ప్రాంతాన్ని ఆ మార్గంలో నడిపించగల సమర్థత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని వైఎస్సార్ సీపీ ఉరవకొండ నియోజకవర్గ సవున్వయుకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
ఉరవకొండ,

సోవువారం పట్టణంలోని 7,8 వార్డుల్లో గడప గడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రవుం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయన వూట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం యుూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించగా, టీడీపీ పూర్తి సహకారం అందించిందన్నారు. రాబోవు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జీడిపల్లి రిజర్వాయుర్ నుంచి 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
హంద్రీనీవా కాలువ ద్వారా వజ్రకరూర్ వుండలంలో 6,754 ఎకరాలకు, విడపనకల్లు వుండలంలో 12,146 ఎకరాలకు, ఉరవకొండలో 18, 410 ఎకరాలకు సాగునీటిని అంది స్తావుని హామీ ఇచ్చారు. ఉరవకొండ పట్టణంలో వైఎస్సార్ సీపీ కృషితో ఇంటి పట్టాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మించి ఇస్తావుని తెలిపారు.
కార్యక్రవుంలో జిల్లా వుహిళా విభాగం అధ్యక్షురాలు బోయు సుశీలవ్ము, ఎస్‌సీ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పయ్యు, పట్టణ నాయుకులు చెంగలవుహేష్, తులసీదాస్, పట్టణ కన్వీనర్ బసవరాజు, మైనార్టీ నాయుకులు శర్మాస్‌ఖాన్‌లు పాల్గొన్నారు.