సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనని ప్రైవేటు బస్సు యజమానులపై ఉద్యమకారులు విరుచుకుపడ్డారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనని ప్రైవేటు బస్సు యజమానులపై ఉద్యమకారులు విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మాజీ మంత్రి జేసి దివాకర్‌రెడ్డి బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల ధర్నా నిర్వహించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఉరవకొండలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాకెట్ల, బూదగవి గ్రామస్తుల రిలేదీక్షలు చేపట్టారు. పద్మశాలిసంఘం ఆధ్వర్యంలో రాయదుర్గంలో ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషించిన డాక్టర్ సుమంత్ గుండెపోటుతో మృతి చెందారు. గుంతకల్లులో టీవీ చూస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.