
హత్య కేసులో నిందితుల అరెస్టు
మండల పరిధిలోని షేక్షానుపల్లిలో ఈనెల 1న హత్యకు గురైన విజయ్ (25) కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐ నగేష్‌బాబు హత్యకేసులో నిందితుల వివరాలు వెల్లడించారు.
ఉరవకొండ : మండల పరిధిలోని షేక్షానుపల్లిలో ఈనెల 1న హత్యకు గురైన విజయ్ (25) కేసులో నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐ నగేష్‌బాబు హత్యకేసులో నిందితుల వివరాలు వెల్లడించారు. నెరిమెట్ల గ్రామానికి చెందిన పూసల ఎర్రిస్వామి భార్యతో విజయ్ అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడన్న అనుమానంతో ఎర్రిస్వామి తన సోదరులు నాగరాజు, నారాయణస్వామి, శంకరప్పతో ఈనెల 1న అర్థరాత్రి విచక్షణారహితంగా దాడి చేయించాడు. విజయ్ తీవ్ర గాయాలతో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 2న మృతి చెందాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నాగరాజు, నారాయణస్వామి అనే వ్యక్తులను పెన్నహోబిళం సమీపంలో సోమవారం అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి దాడికి పాల్పడిన కట్టెలను కుడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శంకర్ కోసం గాలిస్తున్నామన్నారు. ఏఎస్‌ఐ మహేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.