చిట్లు, ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డులేకుండా పోతోంది. విజయవాడలోను, అనంతపురం జిల్లా ఉరవకొండలోను తాజాగా ఈ తరహా మోసాలు జరిగాయి.
చిట్లు, ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డులేకుండా పోతోంది. విజయవాడలోను, అనంతపురం జిల్లా ఉరవకొండలోను తాజాగా ఈ తరహా మోసాలు జరిగాయి. విజయవాడలో పది వేలకు లక్ష రూపాయలు, 5 వేలకు 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించిన ఉమమహేశ్వరి చిట్ఫండ్స్ సంస్థ అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసింది. భగత్సింగ్ నగర్ లాడర్ ఫంక్షన్ హాల్లో ఈ డిపాజిట్లు సేకరించారు. ప్రకటన చూసి మహిళలు వేల సంఖ్యలో డిపాజిట్లు సేకరించారు. తీరా బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు. బాబా చిట్ఫండ్స్ అనే సంస్థ కోటి రూపాయలకు పైగా టోకరా వేసి బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు పరారైపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.