chitfunds
-
చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు. రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర చిట్‌ఫండ్ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు ‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు. విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు. – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్ చేసేశారు నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్ చందాల కోసం డిపాజిట్ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – విశ్వప్రసాద్, బాధితుడు ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో సభ్యునిగా చేరాను. – నందిగం వరప్రసాద్, హైదరాబాద్ ‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు. ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసుకుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు. -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్‌ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది కాల్‌మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చట్ట ప్రకారమే సోదాలు
సాక్షి, అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ సంస్థే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం నివేదించింది. తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తాజా సోదాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని నివేదించింది. చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైనాల జయసూర్య సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. చట్టం ఇచ్చిన అధికారం మేరకే చిట్ రిజిస్ట్రార్లు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పగలు సోదాలు చేస్తుంటే చందాదారులు ఇబ్బంది పడుతున్నారని, కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందంటున్న మార్గదర్శి.. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాత్రిళ్లు సోదాలు చేస్తుంటే తామేదో నేరం చేస్తున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేస్తోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. షట్టర్లు మూసి సోదాలు చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ సంస్థ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఘటనలు రిజిస్ట్రార్ల దృష్టికి వచ్చినందునే చట్ట ప్రకారం చర్యలు చేపట్టారని, నిబంధనలను అనుసరించే స్వతంత్రంగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలనూ ఉల్లంఘించలేదన్నారు. గత సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి సీఐడీ తరఫు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శిపై నమోతైన పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని, రెండింట్లో చార్జిషీట్లు దాఖలు చేశామని చెప్పారు. గతంలో నిర్వహించిన సోదాల్లో సీఐడీకి లభించిన పలు కీలక డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన తరువాత మార్గదర్శి ఎలాంటి మోసాలకు పాల్పడిందో అర్థమైందన్నారు. ఓ చిట్ గ్రూపులో ఇవ్వాల్సిన మొత్తాలను మరో చోట సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. నర్సరావుపేట చిట్ గ్రూపునకు చెల్లించాల్సిన మొత్తాలను రాజమండ్రి గ్రూపులకు సర్దుబాటు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. చందాదారులకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు మార్గదర్శిలో చాలా జరుగుతున్నాయన్నారు. రాత్రివేళ సోదాలు చేస్తున్నారు అంతకు ముందు మార్గదర్శి యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు, మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి వేళ సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిసారీ తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెస్తుంటే.. కొత్త ఎత్తుగడలతో ప్రభుత్వం సోదాలు చేస్తోందన్నారు. గతంలో ఇలాంటి సోదాలు జరగలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే జరుగుతున్నాయని అన్నారు. సోదాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళ లేదా బుధవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెలువరిస్తానని తెలిపారు. అప్పటివరకు సోదాలు చేయకుండా అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎస్‌జీపీ చింతల సుమన్‌కు మౌఖికంగా తెలిపారు. -
రామోజీ, కిరణ్, శైలజలపై ప్రాథమిక ఆధారాలున్నాయి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది. ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్‌లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది. ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు.. మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్ఐఆర్లు, రామోజీరావు, కిరణ్‌ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు. సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు.. ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు. సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు.. చందాదారుల చాటున పిటిషన్లు!
సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్ని చిట్ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది. పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం. ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధారణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చిట్ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రోజుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణంతో చిట్ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టును ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
విచారించాలి.. ఏపీకి రండి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది. రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది. దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది. న్యాయ సూత్రాల ప్రకారం.. రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్ల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోనే విచారించాల్సి ఉంది. రామోజీరావు, శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి. హాజరు కావడం ఆనవాయితీ నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లో శైలజా కిరణ్‌ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్ఐఆర్లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్‌పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు. -
చిట్‌ఫండ్ మోసగాళ్లకు శిక్ష పడాల్సిందే
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ వంటి ప్రైవేటు ఆర్థిక సంస్థలు చేసే మోసాల కేసుల్లో అధికారులు సకాలంలో స్పందించి ఆర్థిక మోసగాళ్లకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో 17వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిట్‌ఫండ్ కంపెనీలు లేదా బ్యాంకింగ్ సేవల పేరిట ప్రజల నుంచి నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలను మోసం చేసేలా ఆయా సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ఇస్తున్న ప్రకటనలపై నిఘా పెట్టాలన్నారు. అలాంటి ప్రకటనలను నిరంతరం పరిశీలించి చర్యలు తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. బ్యాంకులు, చిట్‌ఫండ్ కంపెనీలు, తదితర ఆరి్థక సంస్థల్లో ప్రజలు మదుపు చేసే సొమ్ముకు పూర్తి భరోసాను కలి్పంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసి ఆర్థిక మోసాలను పూర్తిగా నివారించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ మాట్లాడుతూ ఆర్థిక మోసాలను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు ఆర్బీఐకి సహకారం అందించాలన్నారు. రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చాలి రహదారి భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఎనిమిదో తరగతి నుంచి రహదారి భద్రతను పాఠ్యాంశంగా చేర్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం సీఎస్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో రహదారి భద్రత సమావేశాలు క్రమం తప్పకుండా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పరికరాల కోసం పోలీసులకు రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రహదారి భద్రత నిధి కింద రూ.50 కోట్లను కేంద్రం ఈ ఏడాది కేటాయించిందని రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. రవాణాశాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రహదారి భద్రతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
బయటపడ్డ చిట్టీల కుంభకోణం
-
చిట్టీల పేరుతో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్స్ ముసుగులో చిట్టీల పేరుతో వందల మందిని మోసం చేసిన ఘరానా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో చిట్‌ఫండ్స్ యజమాని శైలేశ్ కుమార్ గుజ్జర్.. ప్రజల నుంచి దాదాపు రూ.200 కోట్ల వరకు వసూలు చేసి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న శైలేష్‌తో పాటు అతడి భార్య నందినిని అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేయాలని దాదాపు 50 మంది బాధితులు బుధవారం సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి, అదనపు డీసీపీ జోగయ్యలను కలిశారు. విలాసవంతమైన జీవితం.. డిపాజిట్‌దారుల డబ్బుతో శైలేశ్ విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు అనేక చోట్ల స్థిర, చరాస్తులు కొన్నారు. రూ.50 లక్షల విలువైన ఆడి కారుతో పాటు మరో మూడు ఖరీదైన కార్లు ఉండేవి. రూ.30 కోట్లతో గోవాలో క్యాసినో, హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ నడిపిం చాడు. బోయిగూడలో ఇల్లు, బట్టలబజార్‌లో దుకాణాలు, బెంగళూరులో 1,600 గజాల స్థలం, నల్లగండ్లలో 1,200 గజాల స్థలం శైలేశ్ కొనుగోలు చేసిన వాటిలో కొన్ని. పథకం ప్రకారం శైలేశ్ తన ఇం టిని ఓ బ్యాంకులో కుదువపెట్టి రూ.60 లక్షల అప్పు తీసుకున్నాడు. శైలేశ్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన కొందరు బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వా లంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే వారికి నమ్మకం కలిగేందుకు తన కేసినోలు, పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో ఉన్న షేర్ల విషయం చెప్పేవాడు. ఇంట్లో పనివాళ్ల దగ్గర కూడా.. తన ఇంట్లో పనిచేసే పనివాళ్లను కూడా శైలేశ్ మోసం చేశాడు. ఓ మహిళ రూ.2లక్షల చిట్టీ వేయగా అది కూడా చెల్లించలేదు. పోలీసులకు ఇప్పటి వరకు ఆధారాలతో రూ.53 కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా మరో 600 మంది బాధితులు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. శైలేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దేశం విడిచి పారిపోకుండా అతడిపై లుక్ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. నమ్మకంగా ఉంటూ.. ఓల్డ్‌బోయిగూడకు చెందిన శైలేశ్ గుజ్జర్, అతడి భార్య నందినితో కలసి 1998లో రిషబ్ చిట్‌ఫండ్ సంస్థను స్థాపించాడు. చిట్టీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సేకరించాడు. చిట్టీ వేసిన వారు అది పాడుకున్న తర్వాత వచ్చిన డబ్బును ఇవ్వకుండా తన వద్దే ఫిక్సిడ్ డిపాజిట్ చేయించుకునేవాడు. 20 ఏళ్లుగా నమ్మకంగా ఉంటుండటంతో దాదాపు వెయ్యి మంది రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలు వేశారు. చిట్టీలు పూర్తయిన వారికిరూ.2 వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికి తన వద్దే డిపాజిట్ చేయించేసుకున్నాడు. కొన్నాళ్లు సరిగ్గానే శైలేశ్ వడ్డీ చెల్లించాడు. రెండు, మూడేళ్లుగా వడ్డీలు, చిట్టీలు పాడుకున్న వారికి డబ్బు చెల్లించట్లేదు. ఇటీవల శైలేష్ కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు మహంకాళి పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు కోసం సీసీఎస్‌కు బదిలీ అయింది. -
చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం
సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్ దామోదరన్ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు. -
అక్షరాలా మోసం...!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అక్షరాలు, అంకెలను ఆధారంగా చేసుకుని చిట్‌ఫండ్ సంస్థలు తిమ్మిని బమ్మి చేస్తున్నాయి. పూచిక పుల్లలను పసిడి బిల్ల లుగా పేర్కొంటూ మాయ చేస్తున్నాయి. చిట్, రిజిస్ట్రార్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో లొసుగులుగా మారాయి. ఫలితంగా ప్రజలు తమ తమ అవసరాల కోసం చెమటోడ్చి పైసాపైసా కూడబెట్టి చిట్‌ఫండ్‌లో మదుపు చేసుకున్న సొమ్ముకు గ్యారంటీ లేకుండా పోయింది. వెసులుబాటుతో కొత్త ఎత్తుగడ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థ నిర్వాహకులు చిట్ నిర్వహించే మొత్తానికి సమానమైన నగదును చిట్, రిజిస్ట్రార్ సంస్థ వద్ద డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు పది మంది సభ్యులతో 24 నెలలపాటు రూ.10 లక్షల విలువైన చిట్టీని నిర్వహించేందుకు అనుమతి తీసుకోవాలంటే అంత మొత్తాన్ని చిట్, రిజిస్ట్రార్ వద్ద సెక్యూరిటీ డిపాజిట్‌గా పెట్టాలి. చిట్ నిర్వహణ కాలంలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు నెలనెలా చిట్టీæ కడుతున్న సభ్యులకు నష్టం జరగకుండా డిపాజిట్ చేసిన నగదు నుంచి చిట్, రిజిస్ట్రార్ అధికారులు చెల్లించే అవకాశం ఉంది. గతంలో చిట్ మొత్తం విలువలో పది శాతం నగదు గ్యారంటీ డిపాజిట్ చేస్తే సరిపోయేది. కాలక్రమేణా బోర్డు తిప్పేస్తున్న చిట్‌ఫండ్ కంపెనీల సంఖ్య పెరిగిపోవడంతో చిట్ సభ్యులు నష్టపోకుండా ఉండేందుకు వీలు గా చిట్, రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు తెచ్చా రు. సెక్యూరిటీ డిపాజిట్ విలువను చిట్ విలు వకు సమానం చేశారు. అంటే పది లక్షల విలు వైన చిట్టీ నిర్వహించేందుకు అనుమతి కావాల ంటే రూ పది లక్షల నగదును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఈ నిబంధన కారణంగా సె క్యూరిటీ డిపాజిట్ కోసం భారీ స్థాయిలో నగదు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. దీ న్ని అధిగమించేందుకు స్థిరాస్తులను సెక్యురిటీగా తనఖా పెట్టుకునే వెసులుబాటు కల్పించా రు. దీన్ని ఆసరాగా చేసుకుని చిట్‌ఫండ్ కంపెనీలు కొత్త ఎత్తుడగలకు తెరలేపాయి. పట్టించుకోని అధికారులు స్థిరాస్తులను గ్యారంటీగా చూపించే వెసులుబాటును పలు చిట్‌ఫండ్ కంపెనీలు అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్నాయి. స్థిరాస్తులకు మార్కెట్లో ఉన్న విలువను మించి పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఎకరం స్థలం విలువ మార్కెట్లో రూ.10 లక్షలు ఉంటే.. దాన్ని కోటి రూపాయలుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ విలువనే గ్యారెంటీలుగా పేర్కొంటూ దానికి తగ్గట్లుగా (రూ.కోటి) చిట్టీలు నిర్వహించే అనుమతి పొందుతున్నారు. రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్నట్లు ఆయా స్థలాలకు విలువను మదింపు చేసే విచక్షణాధికారం చిట్, రిజిస్ట్రార్ అధికారులకు ఉంది. పైసాపైసా కూడబెట్టి భవిష్యత్ కోసం దాచుకునే సామాన్యుల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత చిట్, రిజిస్ట్రార్లకు ఉంది. కానీ.. రిజిస్ట్రేషన్ విలువను బట్టి ఎడా పెడా కొత్త చిట్టీలకు అనుమతులు ఇస్తున్నారు. సాంకేతికంగా ఎక్కడ తప్పు జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏవైనా అవాంచనీయ సం ఘటనలు తలెత్తితే.. ఆయా చిట్‌ఫండ్ కంపెనీ గ్యారెంటీ విలువ తక్కువగా ఉండడం వల్ల చిట్టీదారులు నిండా ముగినిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిట్టీలకు కట్టిన డబ్బులు తిరిగి వారికి రావడం కష్టసాధ్యంగా మారుతోంది. చిట్ విలువకు రెండింతల మార్టిగేజ్.. చిట్టీ విలువకు రెండింతలు వచ్చే విధంగా మార్టిగేజ్ (భూమి తనఖా) నిర్ధారణ చేస్తాం. భూమి స్వరూపం, మార్కెట్, ప్రభుత్వ విలువ తదితర అంశాలు బేరీజు వేస్తాం. స్థిరాస్తి వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన అనంతరమే చిట్‌ఫండ్ కంపెనీలకు అనుమతులు ఇస్తున్నాం. ప్రస్తుతం మార్టిగేజ్‌కు బదులు ఫిక్స్డ్ డిపాజిట్లను స్వీకరిస్తున్నాం. – సుజాత, చిట్ సహాయక రిజిస్ట్రార్ ప్రచార ఆర్భాటంతో వెంచర్ల విలువ పెంపు స్థలాలకు విలువను పెంచేందుకు చిట్‌ఫండ్ కంపెనీల నిర్వాహకులు ఎడాపెడా రియల్ వెంచర్లు చేస్తున్నారు. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో గుట్టలు, పంట పొలాల్లో చవకగా దొరికే భూములను కొనేస్తున్నారు. ఈ భూములన్నీ కొద్ది రోజుల్లోనే రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. ఆ తర్వాత ప్రచార ఆర్భాటం చేస్తూ కృత్రిమంగా ఆ స్థలాల విలువను పెంచుతున్నారు. ఈ తరహా ఎత్తుగడలను అరికట్టడంలో చిట్, రిజిస్ట్రార్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థలాలకు సంబంధించిన వాస్తవ విలువను మదింపు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించకుండా చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి సహకారం వల్లే ఈ దందా మూడు స్థలాలు.. ఆరు చిట్టీలు అన్నట్లుగా నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా
హైదరాబాద్: నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో వసూలు చేసిన రూ.70 లక్షలతో ఉడాయించారు ఇద్దరు ఘనులు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ మోసం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే అరవింద్, నవీన్‌చంద్ అనే వారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేశారు. గత పది రోజులుగా వారు కనిపించకపోవటంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
-
చిట్టీల పేరుతో రూ.2.50 కోట్లకు టోకరా
కీసర: చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు. చిట్టీలు, రుణం రూపేణా డబ్బులు మొత్తం కలసి రూ.2.50 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో బాధితులంతా ఆరా తీయగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై దాదాపు 85 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గురవారెడ్డి మల్లేశ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
చిట్టీల పేరుతో.. కుచ్చుటోపీ!!
-
విజయవాడలో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ
-
బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్, ఫైనాన్స్ సంస్థలు
చిట్లు, ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డులేకుండా పోతోంది. విజయవాడలోను, అనంతపురం జిల్లా ఉరవకొండలోను తాజాగా ఈ తరహా మోసాలు జరిగాయి. విజయవాడలో పది వేలకు లక్ష రూపాయలు, 5 వేలకు 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామంటూ డిపాజిట్లు సేకరించిన ఉమమహేశ్వరి చిట్‌ఫండ్స్ సంస్థ అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసింది. భగత్‌సింగ్ నగర్ లాడర్ ఫంక్షన్ హాల్లో ఈ డిపాజిట్లు సేకరించారు. ప్రకటన చూసి మహిళలు వేల సంఖ్యలో డిపాజిట్లు సేకరించారు. తీరా బోర్డు తిప్పేయడంతో డిపాజిటర్లు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండలో కూడా చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టారు. బాబా చిట్‌ఫండ్స్ అనే సంస్థ కోటి రూపాయలకు పైగా టోకరా వేసి బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు పరారైపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.