
చిట్టీల పేరుతో రూ.70 లక్షలకు టోకరా
హైదరాబాద్: నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో వసూలు చేసిన రూ.70 లక్షలతో ఉడాయించారు ఇద్దరు ఘనులు. మైలార్‌దేవ్‌పల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ మోసం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే అరవింద్, నవీన్‌చంద్ అనే వారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది నుంచి రూ.70 లక్షల వరకు వసూలు చేశారు. గత పది రోజులుగా వారు కనిపించకపోవటంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.