
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అక్షరాలు, అంకెలను ఆధారంగా చేసుకుని చిట్‌ఫండ్ సంస్థలు తిమ్మిని బమ్మి చేస్తున్నాయి. పూచిక పుల్లలను పసిడి బిల్ల లుగా పేర్కొంటూ మాయ చేస్తున్నాయి. చిట్, రిజిస్ట్రార్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు అధికారుల పర్యవేక్షణ లోపంతో లొసుగులుగా మారాయి. ఫలితంగా ప్రజలు తమ తమ అవసరాల కోసం చెమటోడ్చి పైసాపైసా కూడబెట్టి చిట్‌ఫండ్‌లో మదుపు చేసుకున్న సొమ్ముకు గ్యారంటీ లేకుండా పోయింది.
వెసులుబాటుతో కొత్త ఎత్తుగడ..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థ నిర్వాహకులు చిట్ నిర్వహించే మొత్తానికి సమానమైన నగదును చిట్, రిజిస్ట్రార్ సంస్థ వద్ద డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు పది మంది సభ్యులతో 24 నెలలపాటు రూ.10 లక్షల విలువైన చిట్టీని నిర్వహించేందుకు అనుమతి తీసుకోవాలంటే అంత మొత్తాన్ని చిట్, రిజిస్ట్రార్ వద్ద సెక్యూరిటీ డిపాజిట్‌గా పెట్టాలి. చిట్ నిర్వహణ కాలంలో ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు నెలనెలా చిట్టీæ కడుతున్న సభ్యులకు నష్టం జరగకుండా డిపాజిట్ చేసిన నగదు నుంచి చిట్, రిజిస్ట్రార్ అధికారులు చెల్లించే అవకాశం ఉంది.
గతంలో చిట్ మొత్తం విలువలో పది శాతం నగదు గ్యారంటీ డిపాజిట్ చేస్తే సరిపోయేది. కాలక్రమేణా బోర్డు తిప్పేస్తున్న చిట్‌ఫండ్ కంపెనీల సంఖ్య పెరిగిపోవడంతో చిట్ సభ్యులు నష్టపోకుండా ఉండేందుకు వీలు గా చిట్, రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు తెచ్చా రు. సెక్యూరిటీ డిపాజిట్ విలువను చిట్ విలు వకు సమానం చేశారు. అంటే పది లక్షల విలు వైన చిట్టీ నిర్వహించేందుకు అనుమతి కావాల ంటే రూ పది లక్షల నగదును సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. ఈ నిబంధన కారణంగా సె క్యూరిటీ డిపాజిట్ కోసం భారీ స్థాయిలో నగదు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. దీ న్ని అధిగమించేందుకు స్థిరాస్తులను సెక్యురిటీగా తనఖా పెట్టుకునే వెసులుబాటు కల్పించా రు. దీన్ని ఆసరాగా చేసుకుని చిట్‌ఫండ్ కంపెనీలు కొత్త ఎత్తుడగలకు తెరలేపాయి.
పట్టించుకోని అధికారులు
స్థిరాస్తులను గ్యారంటీగా చూపించే వెసులుబాటును పలు చిట్‌ఫండ్ కంపెనీలు అడ్డగోలుగా ఉపయోగించుకుంటున్నాయి. స్థిరాస్తులకు మార్కెట్‌లో ఉన్న విలువను మించి పేర్కొంటున్నాయి. ఉదాహరణకు ఎకరం స్థలం విలువ మార్కెట్‌లో రూ.10 లక్షలు ఉంటే.. దాన్ని కోటి రూపాయలుగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ విలువనే గ్యారెంటీలుగా పేర్కొంటూ దానికి తగ్గట్లుగా (రూ.కోటి) చిట్టీలు నిర్వహించే అనుమతి పొందుతున్నారు.
రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్నట్లు ఆయా స్థలాలకు విలువను మదింపు చేసే విచక్షణాధికారం చిట్, రిజిస్ట్రార్ అధికారులకు ఉంది. పైసాపైసా కూడబెట్టి భవిష్యత్ కోసం దాచుకునే సామాన్యుల సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత చిట్, రిజిస్ట్రార్లకు ఉంది. కానీ.. రిజిస్ట్రేషన్ విలువను బట్టి ఎడా పెడా కొత్త చిట్టీలకు అనుమతులు ఇస్తున్నారు. సాంకేతికంగా ఎక్కడ తప్పు జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏవైనా అవాంచనీయ సం ఘటనలు తలెత్తితే.. ఆయా చిట్‌ఫండ్ కంపెనీ గ్యారెంటీ విలువ తక్కువగా ఉండడం వల్ల చిట్టీదారులు నిండా ముగినిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. చిట్టీలకు కట్టిన డబ్బులు తిరిగి వారికి రావడం కష్టసాధ్యంగా మారుతోంది.
చిట్ విలువకు రెండింతల మార్టిగేజ్..
చిట్టీ విలువకు రెండింతలు వచ్చే విధంగా మార్టిగేజ్ (భూమి తనఖా) నిర్ధారణ చేస్తాం. భూమి స్వరూపం, మార్కెట్, ప్రభుత్వ విలువ తదితర అంశాలు బేరీజు వేస్తాం. స్థిరాస్తి వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించిన అనంతరమే చిట్‌ఫండ్ కంపెనీలకు అనుమతులు ఇస్తున్నాం. ప్రస్తుతం మార్టిగేజ్‌కు బదులు ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వీకరిస్తున్నాం.
– సుజాత, చిట్ సహాయక రిజిస్ట్రార్
ప్రచార ఆర్భాటంతో వెంచర్ల విలువ పెంపు
స్థలాలకు విలువను పెంచేందుకు చిట్‌ఫండ్ కంపెనీల నిర్వాహకులు ఎడాపెడా రియల్ వెంచర్లు చేస్తున్నారు. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో గుట్టలు, పంట పొలాల్లో చవకగా దొరికే భూములను కొనేస్తున్నారు. ఈ భూములన్నీ కొద్ది రోజుల్లోనే రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. ఆ తర్వాత ప్రచార ఆర్భాటం చేస్తూ కృత్రిమంగా ఆ స్థలాల విలువను పెంచుతున్నారు. ఈ తరహా ఎత్తుగడలను అరికట్టడంలో చిట్, రిజిస్ట్రార్ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థలాలకు సంబంధించిన వాస్తవ విలువను మదింపు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించకుండా చిట్‌ఫండ్ కంపెనీ నిర్వాహకులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి సహకారం వల్లే ఈ దందా మూడు స్థలాలు.. ఆరు చిట్టీలు అన్నట్లుగా నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment