కీసర: చిట్టీలు, అప్పుల పేరుతో జనం నుంచి రూ. 2.50 కోట్ల మేర వసూలు చేసి పరారయ్యాడు ఓ వ్యాపారి. రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన రాకుల మల్లేశ్ గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అందరితోనూ ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తున్నాడు.
చిట్టీలు, రుణం రూపేణా డబ్బులు మొత్తం కలసి రూ.2.50 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో బాధితులంతా ఆరా తీయగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. దీనిపై దాదాపు 85 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ గురవారెడ్డి మల్లేశ్ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.