ఉరవకొండలో రానా సందడి
ఉరవకొండ : సురేష్ ప్రొడెక‌్షన్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను మంగళవారం ఉరవకొండ ఎస్‌కె ప్రభుత్వ క్రీడా మైదానంలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రానా నటిస్తున్నారు. అనంతపురం జిల్లా రాజకీయ నేపథ్యంలో పలు సన్నివేషాలను చిత్రీకరించారు.
చిత్రంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా జోగేంద్ర (రానా) ఎన్నికల ప్రచార సభను షూట్ చేశారు. ఇక... ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న కాజోల్‌కు సంబంధించిన సన్నివేశాలను మండల పరిధిలోని ఆమిద్యాల, రాకెట్ల, కొట్టాలపల్లిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.