
సాక్షి, ఉరవకొండ రూరల్: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల, రాకెట్ల, చిన్నముస్టూరు, పెద్దముస్టూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి భూమి కంపించింది. పెద్ద శబ్దాలు రావడం, ఇళ్లలోని సామాగ్రి కదిలినట్లు అనిపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మూడు గ్రామాల్లోనూ ప్రజలు రాత్రంతా జాగరణ చేశారు. భూకంపం వల్ల పాత ఇళ్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment