మూతపడిన ఉరవకొండ సబ్‌జైలు | uravakonda sub jail closed | Sakshi
Sakshi News home page

మూతపడిన ఉరవకొండ సబ్‌జైలు

Published Tue, Feb 21 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

uravakonda sub jail closed

∙కడప డీఐజీ నుంచి వెలువడిన ఉత్తర్వులు 
∙ సబ్‌ జైలర్‌ కడపకు బదిలీ  

ఉరవకొండ : ఉరవకొండ సబ్‌ జైలు మూతపడింది. కడపలోని జైళ్ల శాఖ డీఐజీ కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు ఉరవకొండ సబ్‌ జైలు అధికారులకు అందాయి. నెలకు ఒక సారి నిల్‌ లాకప్‌ నమోదు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.  1983లో మొత్తం 23 మంది ఖైదీల సామర్థ్యంతో సబ్‌జైలు ఏర్పాౖటెంది. దీంతో పాటు 2010లో జైలును రూ.55 లక్షల వ్యయంతో ఆధునీకరించారు. జైలు నిర్వహణకు ఖైదీలు లేక పోయినా ఏడాదికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు అవుతుండంతో ఉన్నతాధికారులు దీన్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉరవకొండ సబ్‌ జైలు మూతపడటంతో ఇక్కడ పని చేస్తున్న సబ్‌ జైలర్‌ రఘనాథరెడ్డిని కడప సెంట్రల్‌ జైలుకు, ఇద్దరు వార్డెన్లు వెంకటరవి, జయరాములును పెనగొండ సబ్‌జైలుకు, ఒక హెడ్‌వార్డె¯ŒS భాస్కర్‌రావును తాడిపత్రి, మరో హెడ్‌వార్డె¯ŒS నాగేంద్రప్రసాద్‌ను హిందూపురం సబ్‌ జైలుకు బదిలీ చేశారు.  

రికార్డులు పరిశీలించిన జిల్లా జైళ్లశాఖ అధికారి   
స్థానిక సబ్‌జైలులో రికార్డులను జైళ్లశాఖ జిల్లా అధికారి సుదర్శనరావు సోమవారం రాత్రి పరిశీలించారు. పలు కీలక రికార్డులను సబ్‌ జైలర్‌ నుంచి స్వాధీనం చేసుకొని, పర్నీచర్‌ను ఇతర సబ్‌ జైళ్లకు తరలించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ ఖైదీల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో సబ్‌జైలును మూత వేస్తున్నట్లు తెలిపారు. ఉరవకొండ సబ్‌జైలర్‌ రఘనాథ్‌రెడ్డితో పాటు సిబ్బందిని మరో సబ్‌ జైలుకు బదిలీ చేశామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement