జిల్లా జైలు భవనం నమునా
సిద్దిపేటకమాన్: సిద్దిపేట ఎన్సాన్‌పల్లి శివారులో జిల్లా జైలు ఏర్పాటు కానుంది. రూ.78 కోట్ల వ్యయంతో 34 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న భవానికి మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం పట్టణంలో 15 మంది ఖైదీల కెపాసిటీతో సబ్ జైలు కొనసాగుతుండగా ఎన్సాన్‌పల్లిలో 21 ఫీట్ల ఎత్తుతో హై సెక్యూరిటీ గోడలు, 17 బ్లాక్‌లతో కొత్త జైలు త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త జైలులో అడ్మిన్ బ్లాక్, హాస్పిటల్ బ్లాక్, క్వార్టర్స్, రిసిప్షెన్, అడ్మిన్ బ్లాక్, డార్మెటరీ, లైబ్రెరీ, ఫీమెల్ బ్లాక్, పురుషులు, మహిళలు వేర్వేరుగా లాకప్‌లు, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. సుమారు 500 మంది ఖైదీల కెపాసిటీ, 50 మంది సిబ్బంది విధులు నిర్వహించేలా నిర్మించనున్నారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి అందుబాటులోకి తేనున్నట్లు పోలీస్ హౌసింగ్ ఏఈ సుధాకర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment