పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ | prisoners clashes in peleru sub jail | Sakshi
Sakshi News home page

పీలేరు సబ్‌జైలులో ఖైదీల ఘర్షణ

Published Wed, Oct 25 2017 2:20 PM | Last Updated on Wed, Oct 25 2017 2:20 PM

చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది.

సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్‌జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కాయిన్‌బాక్స్‌ వద‍్ద ఫోన్‌ చేసుకునే విషయమై ఖైదీల మధ్య గొడవ జరిగింది. కలికిరి మండలానికి చెందిన నారాయణరెడ్డి అనే ఖైదీ కాయిన్‌బాక్స్‌ వద్ద ఫోన్‌ మాట్లాడుతుండగా.. ఎంత సేపు మాట్లాడతావంటూ తోటి ఖైదీలు వాదనకు దిగారు. ఈ విషయమై ఖైదీల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. నారాయణరెడ్డిపై తోటి ఖైదీలు దాడికి దిగారు. వెంటనే స్పందించిన జైలు అధికారులు ఖైదీలను వారించి అక్కడి నుంచి పంపివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement