కానిస్టేబుల్ బైక్ ధ్వంసం విచారణ చేస్తున్న అర్బన్ సీఐ సబ్ జైల్‌పై దాడి చేసిన చంద్రశేఖర్
నందికొట్కూరు/పగిడ్యాల: సబ్ జైలుపై పాత ఖైదీ చంద్రశేఖర్ రాళ్లతో దాడి చేసి, కానిస్టేబుల్ బైక్‌ను ధ్వంసం చేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మణారావు తెలిపిన వివరాలు.. పగిడ్యాల మండలం పీకే ప్రాగటూరు గ్రామానికి చెందిన పాత ఖైదీ చంద్రశేఖర్ ఉదయం 7 గంటలకు జైలు వద్దకు చేరుకున్నాడు. తన తల్లి లక్ష్మిదేవిని చూపించాలంటూ జైలుపైకి రాళ్లతో దాడి చేశాడు. జైలు వద్ద పార్క్ చేసి ఉంచిన కానిస్టేబుల్ ప్రదీప్ బైక్‌పై బండరాళ్లు వేసి ధ్వంసం చేశాడు.
సమాచారం అందుకున్న అర్బన్ సీఐ మధుసూదన్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తన కుమారుడు చంద్రశేఖర్ సైకోగా మారి ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తూ తనకు తలవంపులు తెస్తున్నాడని నిందితుడి తండ్రి గుందిమల్ల వెంకటరమణ ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నందికొట్కూరు జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా, విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment