సబ్‌జైలును సందర్శించిన నాయ్యమూర్తి | judge visits sub jail | Sakshi
Sakshi News home page

సబ్‌జైలును సందర్శించిన నాయ్యమూర్తి

Published Wed, May 31 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

judge visits sub jail

కదిరి టౌన్‌ : కదిరి సబ్‌జైలును బుధవారం సాయంత్రం సీనియర్‌ సివిల్‌ జడ్జి సీ.ఆర్‌.సుమలత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను జైలు సూపరింటెండెంట్‌ మల్లికార్జున, సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. ఖైదీల వంట గది, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను జడ్జి పరిశీలించారు. వంటను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఖైదీలకు అనుకూలంగా ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించారు. అనంతరం కాసేపు ఆమె ఖైదీలతో ముచ్చటించారు. న్యాయవాదులు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, సిరాజుద్దీన్, దశరథనాయక్, సిబ్బంది ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement