
సాక్షి, వికారాబాద్: పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. శనివారం ఉదయం ఆ శివ స్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు తాండూరు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది.
శివ స్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది తాండూరు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. స్వాములను మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని శివ స్వాములు చెప్తున్నారు. శివమాలలు తీయబోమని స్వాములు చెప్పడంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. మీడియాతో సహా జైలు ఆవరణలో ఎవరినీ ఉండకుండా పంపించేస్తున్నారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment