న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసు విషయమై దోషులను ముందస్తుగా విడుదల చేయడం పెను వివాదంగా మారిన సంగతి తెలిసిందే. పైగా కేంద్రం అనుమతితోనే గుజరాత్ ప్రభుత్వం వారిని విడుదల చేసినట్లు సుప్రీం కోర్టుకు విన్నవించడంతో రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనా అస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఆయన మహిళలను గౌరవించాలంటూ రేపిస్టుల తరుఫున ఉంటారంటూ విమర్శలు గుప్పించారు. ఆయన చేసే వాగ్ధానాలకు, చేస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుందని అన్నారు. ఆయన మహిళలను దారుణంగా మోసం చేశారన్నారు. అంతేగాదు ఆగస్టు 15న 'ఉమెన్ ఎంపవర్‌మెంట్" గురించి గొప్పగా మాట్లాడి ఆ తర్వాత రోజే దారుణమైన నేరానికి ఒడిగట్టిన బిల్కిస్ బానో కేసు నిందితులను విడుదల చేశారంటూ విరుచుకుపడ్డారు.
ఆయన భారత స్వాతంత్య్రం రోజున తన ప్రసంగంలో మహిళ గౌరవాన్ని తగ్గించే పని ఏదీ చేయనని, అలాగే మహిళల పట్ట మన ఆలోచన తీరు మారాలంటూ గొప్పగా మాట్లాడారు. మరి ఇప్పడూ... ఆ నిందితులకు విధించిన జీవిత ఖైదు శిక్ష సరిగా అనుభవించక మునుపే విడుదల చేయడమే గాక సత్ప్రవర్తన కారణంగానే విడుదల చేశామంటూ సమర్ధించుకోవడం ఏమిటంటూ? నిలదీశారు. ఈ బిల్కిస్ బానో కేసు నిందితులు పాల్పడ్డ నేరాన్ని సీబీఐ, ప్రత్యేక కోర్టు సైతం క్షమింపరాని ఘోరమైన నేరంగా అభివర్ణిస్తే కేవలం 15 ఏళ్లు పూర్తికాగానే ముందస్తుగా విడుదల చేయడం సబబేనే అని మోదీపై విమర్శల వర్షం కురింపించారు.
Comments
Please login to add a commentAdd a comment