బిగ్‌బాస్ 3 ఫేమ్, టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చివరికి జరగుతోంది’ అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన అభిమానులు షాక్ గురయ్యారు. పునర్నవి రహస్యంగా నిశ్చితార్థ చేసేసుకుందని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. దీంతొ కొందరు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందా.. లేక సినిమా ప్రమోషనా అని అయోమయంలో ఉన్నారు.
ఇక ఈ షాక్ నుంచి తేరుకోకముందే పునర్నవి గురువారం మరో పోస్టు చేశారు. ‘అతనికి యెస్ చెప్పాను అని ప్రముఖ యూట్యూబర్ ఉద్భవ్ రఘునందర్ అనే వ్యక్తి ఫోటోను షేర్ చేశారు. అంతేగాక జీవితంలోని గొప్ప రోజు గురించి రేపు (ఆక్టోబర్30) చెబుతానని పేర్కొన్నారు. మరో వైపు రఘునందర్ సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి ‘ఆమె నాకు అవునని చెప్పింది. రేపు మీకో విషయం చెప్పడానికి ఎంతో ఎదురుచూస్తున్నాను’. అని పేర్కొన్నారు.
కాగా ఉద్భవ్ నటుడు, రచయిత, ఫిలిం మేకర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చికాగో సుబ్బారావు పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి వెబ్ సిరీస్‌లోనూ నటించారు. ఇదిలా ఉండగా పునర్నవికి నిజంగా ఎంగేజ్‌మెంట్ అయ్యిందా అనే సందేహంలో అభిమానులు పిచ్చేక్కిపోతున్నారు. ఎటు తేల్చుకోలేని స్థితిలో అయోమయానికి గురవుతున్నారు. మరి అసలు విషయమెంటో తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. ఏదేమైనా పునర్నవి టాపిక్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.’
@PunarnaviBHU
— Udbhav Raghunandan (@itsudbhav) October 29, 2020
She said yes🕺🏽
Naaaice 😍
Can't wait to tell you all about the big day tomorrow 🌹 pic.twitter.com/Q4MbCqdn0c
Comments
Please login to add a commentAdd a comment