దటీజ్ ఎమ్మెల్యే హీరాలాల్! | Rajasthan MLA's son in queue for peon's job | Sakshi
Sakshi News home page

దటీజ్ ఎమ్మెల్యే హీరాలాల్!

Published Sat, Mar 21 2015 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ

ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ

జైపూర్: రాజకీయ నాయకులు ఎవరైనా తన కొడుకు ఆయన లాగా రాజకీయ నాయకుడు కావాలనో లేక వేరే పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటారు. అందుకోసం అవసరమైతే దొడ్డిదారిలో కొడుక్కి ఉద్యోగాలు కూడా ఇప్పించుకుంటారు. కానీ రాజస్తాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ ఇందుకు విరుద్ధం.  ఎనిమిదో తరగతి పాసైన తన కొడుక్కి ప్యూన్ ఉద్యోగమే సరియైనదని చెప్పారు. తన కొడుకు హన్స్‌రాజ్ అర్హత, శక్తి సామర్థ్యాలకు ఇలాంటి ఉద్యోగమే సరిపోతుందని సాక్షాత్తు ఆయనే చెప్పడం విశేషం.  రాజస్థాన్ స్టేట్ వ్యవసాయ మార్కెట్ బోర్డులోని ఈ ఉద్యోగానికి శుక్రవారం అజ్మీర్‌లో జరిగిన ఇంటర్వ్యూ కి హన్స్‌రాజ్ హాజరయ్యారు.

ఇంటర్వ్యూ బాగా జరిగిందని తన కొడుక్కి ఉద్యోగం వస్తుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వర్మ రాజకీయాల్లోకి రాక ముందు సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు.  మూడు సబ్జెక్టులలో ఆయన మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. వర్మ గోల్డ్‌మెడలిస్ట్ కూడా. కానీ  ఆయన కొడుక్కి మాత్రం చదువు అబ్బలేదు.  ప్రస్తుతం హన్స్‌రాజ్ నెలకు రూ.5వేల జీతానికి ఓ ప్రై వేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement