peon job
-
జాబ్ కోసం సైకిల్ తొక్కుతున్న ఇంజినీర్లు!
ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ మరే ఉద్యగానికి ఉండదు. చిన్న ఉద్యోగమైనా చాలు లైఫ్ సెటిల్ అవుతుందని యువత భావిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు చాలా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. కేరళలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్యూన్ ఉద్యోగానికి అవసరమైన అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) ప్యూన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండకూడదని నిబంధన ఉన్ననప్పటికీ చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఇతర డిగ్రీ ఉత్తీర్ణులు ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్ష కోసం వరుసలో ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో డిగ్రీలు ఉన్న యువకులు సైకిల్‌తో వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రతే కారణం ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే భద్రత ఉంటుందని యువత భావిస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దశాబ్దాలుగా అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉండటం మరో కారణం. ప్యూన్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం దాదాపు రూ. 23వేలు ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. గతంలో ఆఫీసు అసిస్టెంట్లు విధుల్లో భాగంగా సైకిళ్లపైనే వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేకపోయినప్పటికీ, ప్యూన్ పోస్టుల కోసం ఇప్పటికీ సైక్లింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పోస్టులకు అభ్యుర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఎటాంటి డిగ్రీ లేదని డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. డిగ్రీ లేని వ్యక్తులు కేరళ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. సైక్లింగ్ పరీక్ష పూర్తయిన తర్వాత, ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగార్థులు ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. -
ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు
ఇస్లామాబాద్: కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఫలితంగా అన్ని దేశాల్లో నిరుద్యోగత భారీగా పెరిగింది. ఎంతలా అంటే కేవలం ఒక్క ఫ్యూన్ పోస్ట్ ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారంటే.. నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దాయాది దేశం పాకిస్తాన్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్లో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకున్నది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ (పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. (చదవండి: ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయమే ప్రాణం తీసింది!) పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ తన సర్వే వివరాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. వీరిలో ఎంఫిల్ చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరిని కూడా గణాంకాల్లో చేర్చినట్లయితే నిరుద్యోగిత రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. (చదవండి: యువత ఉద్యోగాలు హుష్ కాకి) మరో నివేదిక పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లేబర్ ఫోర్స్ సర్వే (ఎల్ఎఫ్ఎస్) ప్రకారం, పాకిస్తాన్లో నిరుద్యోగం 2017-18లో 5.8శాతం నుంచి 2018-19లో 6.9 శాతానికి పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం 5.1 శాతం నుంచి 5.9 శాతానికి పెరగగా.. మహిళా నిరుద్యోగం 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. ఇక ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కార్మికులు ఉన్న దేశాల్లో పాకిస్థాన్ 9 వ స్థానంలో ఉన్నదని ఎకనామిక్ సర్వే నివేదిక పేర్కొన్నది. చదవండి: పాకిస్తాన్‌ని సాగనంపాల్సిందేనా? -
ప్యూన్ ఉద్యోగానికి.. 3700 పీహెచ్డీ అభ్యర్థుల పోటీ
లక్నో : ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య కేవలం 62 కానీ.. వాటికి వచ్చిన అప్లికేషన్లు ఏకంగా 93,500. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తోందో ఈ ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. టెలికాం డిపార్ట్మెంట్లో ఖాళీ అయిన 62 ప్యూన్ పోస్టులకు అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉండడంతో ఏకంగా పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ప్యూన్ పోస్టుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. 93,500 అప్లికేషన్లు రాగా వాటిలో పీహెచ్డీ పూర్తి చేసిన వారు 3,700, పీజీ పూర్తి చేసిన వారు 50,000, డిగ్రీ ఇతర కోర్సులు పూర్తి చేసిన వారు 28,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు టెలికాం డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, నిరుద్యోగులపై సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎస్పీ నేత అబ్దుల్ హాఫీజ్ గాంధీ విమర్శించారు. -
ప్యూన్ ఉద్యోగానికి ఎమ్మెల్యే కొడుకు
జైపూర్: రాజకీయ నేతలు ఎవరైనా తన కొడుకు తమలాగే నాయకుడు కావాలనో, లేకపోతే పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటారు. అవసరమైతే దొడ్డిదారిలోఉద్యోగాలు ఇప్పించుకుంటారు. కానీ రాజస్థాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ ఇందుకు విరుద్ధం. 8వ తరగతి పాసైన తన కొడుక్కి ప్యూన్ ఉద్యోగమే సరైందన్నారు. తన కొడుకు హన్స్‌రాజ్ అర్హతకు కు ఇలాంటి ఉద్యోగమే సరిపోతుందన్నారు. శనివారం ఈ ఉద్యోగానికి అజ్మీర్‌లో జరిగిన ఇంటర్వ్యూకు హన్స్‌రాజ్ హాజరయ్యారు. ఇంటర్వ్యూ బాగా జరిగిందని తన కొడుక్కి ఉద్యోగం వస్తుందని వర్మ అన్నారు. వర్మ రాజకీయాల్లోకి రాక ముందు సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు. గోల్డ్‌మెడలిస్ట్ కూడా. కొడుక్కి మాత్రం చదువు అబ్బలేదు. ప్రస్తుతం నెలకు రూ.5వేల జీతానికిప్రైవేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు. -
దటీజ్ ఎమ్మెల్యే హీరాలాల్!
జైపూర్: రాజకీయ నాయకులు ఎవరైనా తన కొడుకు ఆయన లాగా రాజకీయ నాయకుడు కావాలనో లేక వేరే పెద్ద ఉద్యోగాలు చేయాలనో కోరుకుంటారు. అందుకోసం అవసరమైతే దొడ్డిదారిలో కొడుక్కి ఉద్యోగాలు కూడా ఇప్పించుకుంటారు. కానీ రాజస్తాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ వర్మ ఇందుకు విరుద్ధం. ఎనిమిదో తరగతి పాసైన తన కొడుక్కి ప్యూన్ ఉద్యోగమే సరియైనదని చెప్పారు. తన కొడుకు హన్స్‌రాజ్ అర్హత, శక్తి సామర్థ్యాలకు ఇలాంటి ఉద్యోగమే సరిపోతుందని సాక్షాత్తు ఆయనే చెప్పడం విశేషం. రాజస్థాన్ స్టేట్ వ్యవసాయ మార్కెట్ బోర్డులోని ఈ ఉద్యోగానికి శుక్రవారం అజ్మీర్‌లో జరిగిన ఇంటర్వ్యూ కి హన్స్‌రాజ్ హాజరయ్యారు. ఇంటర్వ్యూ బాగా జరిగిందని తన కొడుక్కి ఉద్యోగం వస్తుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వర్మ రాజకీయాల్లోకి రాక ముందు సాంఘిక సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేశారు. మూడు సబ్జెక్టులలో ఆయన మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. వర్మ గోల్డ్‌మెడలిస్ట్ కూడా. కానీ ఆయన కొడుక్కి మాత్రం చదువు అబ్బలేదు. ప్రస్తుతం హన్స్‌రాజ్ నెలకు రూ.5వేల జీతానికి ఓ ప్రై వేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నాడు.