
లక్నో : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన షహజన్‌పూర్‌కు చెందిన మహిళ తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నేత కుమారుడిపై ఆరోపణలు చేసినప్పటి నుంచి హెచ్చరికలు వస్తున్నాయని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని కొందరు దుండగలు బాధితురాలిని బెదిరిస్తున్నారని ఆమె న్యాయవాది అవధేష్ సింగ్ చెప్పారు.
ఫిర్యాదును వెనక్కితీసుకోకుంటే హతమారుస్తామని గూండాలు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలిని బెదిరించారని వెల్లడించారు. తనను లైంగికంగా వేధించిన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సదరు మహిళ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఉన్నావ్, కథువా లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిపై బాధితురాలు చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment