మనుబోలు: అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మడమనూరు, వీరంపల్లి గ్రామాల్లో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాకాణి మాట్లాడుతూ ఎవరి కోసమైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారో వారికి చేరినప్పుడే జన్మభూమి వల్ల ప్రయోజనం కలుగుతుందన్నారు. కనుపూరు కాలువలో పూడిక తీయాలని తాను చాలా కాలంగా కోరుతున్నానన్నారు.
సకాలంలో సాగు నీరు అందక ప్రతి ఏటా కెనాల్ పరిధిలో వేలాది ఎకరాల్లో పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి కూడా పంట ఎండిపోతే అందుకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జిల్లాలో 54 వేల మంది పింఛన్లను తొలగించారన్నారు. అర్హులైన వారి పింఛన్లను పునరుద్ధరించే ప్రక్రియను అధికారులు చేపట్టాలన్నారు.
పార్టీలు, వర్గాలకు అతీతంగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతానన్నారు. అనంతరం లబ్ధిదారులకు పిం ఛన్లు అందజేశారు. అధికారులతో కలిసి మొక్కలు నాటారు. వైద్యులు శిరీష, సుజాత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సత్యనారాయణ, తహశీల్దార్ కేవీ రమణయ్య, ఆర్‌ఐ సునీల్, ఎంపీడీఓ హేమలత, సీడీపీఓ శారద, ఏపీఎం విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, మడమనూరు సర్పంచ్ రాధయ్య, ఎంపీటీసీ శేషమ్మ, వీరంపల్లి సర్పంచ్ సురేంద్ర, నాయకులు మన్నెమాల సుధీర్‌రెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, పూండ్ల రామ్మోహన్‌రెడ్డి, వెందోటి భాస్కర్‌రెడ్డి, కసిరెడ్డి ధనంజయరెడ్డి, అడపాల శివకుమార్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు పేదలకు అందాలి
Published Thu, Oct 9 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM
Advertisement
Advertisement