వైరల్: ట్రాఫిక్ నరకం.. అది బెంగళూరు వాసులకు నిత్యానుభవం. మామూలు రోజుల్లోనే ఆ ఐటీ నగరంలో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందునా తాజాగా కురిసిన వర్షాలతో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే అలాంటి పరిస్థితుల్లో.. తన పేషెంట్ కోసం పరుగులు తీసిన ఓ డాక్టర్‌ను ఇప్పుడంతా ‘శభాష్’ అని అభినందిస్తున్నారు.
మణిపాల్ హాస్పిటల్‌లో పనిచేసే గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు. దీంతో ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఎంతకీ ట్రాఫిక్ తగ్గకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చేసి కారు దిగి అవతలి రోడ్డుకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో చూసేసరికి ఆ దూరం 45 నిమిషాలు చూపించింది. అయితే ఆయన అలస్యం చేయకుండా.. పరుగున మూడు కిలోమీటర్లలో ఆస్పత్రికి చేరుకున్నారు. శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
@BPACofficial @BSBommai @sarjapurblr @WFRising @blrcitytraffic sometimes better to run to work ! pic.twitter.com/6mdbLdUdi5
— Govind Nandakumar MD (@docgovind) September 10, 2022
తన కోసం పేషెంట్ వెయిట్ చేస్తున్నారన్న ఆలోచనతో ఇంకేం ఆలోచించకుండా ఆస్పత్రికి పరుగుతీశానని డాక్టర్ గోవింద్ నందకుమార్ చెప్తున్నారు. ‘‘కన్నింగ్‌హామ్ రోడ్డు నుంచి సర్జాపూర్‌లోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా ఆస్పత్రికి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నా పేషెంట్లు సర్జరీ పూర్తయ్యే వరకు భోజనం చేయడానికి అనుమతించనందున, ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండే సమయాన్ని వృథా చేయకూడదనుకున్నాను.
నాకు డ్రైవర్ ఉన్నాడు, కాబట్టి, నేను కారును వెనుక వదిలి వెళ్ళగలిగాను. నేను క్రమం తప్పకుండా జిమ్ చేయడం వల్ల నాకు పరుగెత్తడం ఈజీ అయ్యింది. నేను ఆసుపత్రికి మూడు కిలోమీటర్లు పరిగెత్తాను. శస్త్రచికిత్సకు సమయానికి చేరుకోగలిగాను. రోగులు, వారి కుటుంబాలు కూడా డాక్టర్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటాయి. అయితే.. అంబులెన్స్‌లో ఉన్న రోగి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అంబులెన్స్ వెళ్లేందుకు కూడా స్థలం లేదు అని గోవింద్ తన వీడియోను కర్నాటక ముఖ్యమంత్రికి ట్విటర్‌లో ట్యాగ్ చేశారు. ప్రస్తుతం డాక్టర్ గోవింద్‌పై సోషల్ మీడియాలో ఈయన చర్యపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: 61 సార్లు గెలిచిన గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఆ పెద్దాయన
Comments
Please login to add a commentAdd a comment