రూటు మార్చిన యంగ్ హీరో | Sundeep Kishan Busy with three Films | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన యంగ్ హీరో

Published Thu, Mar 24 2016 2:20 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

రూటు మార్చిన యంగ్ హీరో - Sakshi

రూటు మార్చిన యంగ్ హీరో

రన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సందీప్ కిషన్, ఆ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా తిరిగి షూటింగ్లతో బిజీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఇక పై ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న 'ఒక్క అమ్మాయి తప్ప' అనే సినిమాలో నటిస్తున్నాడు. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న, ఈ సినిమా అంతా ఓ ఫ్లై ఓవర్ మీద ఒక్క రాత్రిలో జరిగే ప్రేమకథ.

ఈ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడితో 'మా నగరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. రెజీనా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మూడు నాలుగు విభిన్న కథలను ఒకేసారి తెరమీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత పిజ్జా నిర్మాత సివి కుమార్ డైరెక్షన్లో మాయావన్ అనే సైన్స్ఫిక్షన్ థ్రిల్లర్లో నటించడానికి అంగీకరించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను కూడ ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు సందీప్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement