ఆ గ్లామర్‌ ఎంతో స్పెషల్‌ | Social Service And Model Sangeetha Special Story | Sakshi
Sakshi News home page

ఆ గ్లామర్‌ ఎంతో స్పెషల్‌

Published Tue, Sep 24 2019 12:49 PM | Last Updated on Tue, Sep 24 2019 12:49 PM

Social Service And Model Sangeetha Special Story - Sakshi

శ్రీవిద్య సెంటర్‌ ఫర్‌ స్పెషల్‌ చిల్డ్రన్‌ హోమ్‌ చిన్నారులతో చందన

సాక్షి,సిటీబ్యూరో:ర్యాంప్‌పై మెరుపులు మెరిపిస్తుంది.  మంచి మనసుతోనూ మురిపిస్తుంది. మంచిని పంచేందుకు ముందుంటుంది. సిటీ మోడల్‌ చందనా ప్రేమ్‌... సేవాలంటీర్‌గా సామాజిక కార్యక్రమాల్లో తన ఆలోచనల్ని పంచుకుంటోంది.

కిడ్స్‌– మామ్స్‌ ఫ్యాషన్‌ రన్‌ వే 29న
ఆ చిన్నారుల కోసం ఏమైనా పెద్ద సాయం చేయాలనే ఆలోచనతో నాకు పరిచయం ఉన్న ర్యాంప్‌ను వేదిక చేసుకున్నాను. అలా కిడ్స్‌ అండ్‌ మామ్‌ ఫ్యాషన్‌ రన్‌ వే కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనిలో భాగంగా స్పెషల్‌ చిన్నారుల డ్యాన్స్, లైవ్‌ బ్యాండ్‌ పెర్ఫార్మెన్స్, తల్లులూ, పిల్లల ర్యాంప్‌ వాక్,  స్పెషల్‌ చిల్డ్రన్‌ ర్యాంప్‌వాక్‌...వంటివి ఉంటాయి. ఈ నెల 29న కొండాపూర్‌లోని హార్ట్‌ కప్‌ కఫేలో దీన్ని
నిర్వహిస్తున్నాం.   

ఇదో స్పెషల్‌ ప్రోగ్రామ్‌...
ఐటి ఉద్యోగినిగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాని చందనా ప్లాన్‌ చేసిన ఈ ఈవెంట్‌ చాలా ప్రత్యేకమైనది. స్పెషల్‌ చిల్డ్రన్‌ గురించి ఎంత చేసినా తక్కువే. ఈ ఈవెంట్‌ సక్సెస్‌ అవడం అంటే ఒక హెల్పింగ్‌ హ్యాండ్‌ గెలిచినట్టే. – సంగీత

మోడలింగ్‌ ప్రొఫెషనల్‌లో బిజీగా ఉంటూనే లైఫ్‌స్కిల్స్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను..కొంతకాలంగా  సోషల్‌ యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యాను.  అందులో భాగంగా శ్రీవిద్య సెంటర్‌ ఫర్‌ స్పెషల్‌ చిల్డ్రన్‌ హోమ్‌కి వెళ్లాను. ఆ సెంటర్‌  తొలుత 8 మందితో మొదలై ఇప్పుడు 160 మంది íస్పెషల్‌ చిల్డ్రన్‌కు ఆశ్రయం ఇస్తోంది.  అమాయకమైన  పిల్లలను చూస్తుంటే  బాధ, వాళ్ల గురించి ఏమైనా చేయాలనిపించింది.  వీలున్నప్పుడల్లా  స్నేహితురాలు సంగీతతో  అక్కడికి వెళ్లొచ్చేదాన్ని. అక్కడి చిన్నారుల్లో   ప్రతిభ ఉంది. దానికి వెలుగునిచ్చి, అదే చేత్తో వారికి కావాల్సిన అత్యాధునిక వసతి సౌకర్యం  ఏర్పాటు చేయాలని అనుకున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement