చీరకట్టు చిరాకేం కాదు... చక్కదనానికి కేరాఫ్ అడ్రస్ అని నిరూపిస్తూ బెంగళూరులో శారీరన్‌ను నిర్వహించింది టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్ విభాగం తనైరా. 2,500 మంది మహిళలు పాలుపంచుకున్న ఈ శారీ రన్‌లో వయసు తారతమ్యాలేవీ లేకుండా రంగు రంగుల, రకరకాల చీరలు ధరించిన మహిళామణులు చీరకట్టులోని సొగసును, పొందికను చీరకట్టు అందాన్ని గర్వంగా, హుందాగా ప్రదర్శించారు.
బెంగళూరుకు చెందిన టాటా కంపెనీ ఎత్నిక్‌వేర్ విభాగం తనైరా, జేజే యాక్టివ్ సంస్థలు ఆదివారం సంయుక్తంగా ఈ శారీరన్ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్, జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ...‘చీరను స్త్రీత్వానికి, స్త్రీసాధికారతకు ముఖ్యంగా భారతీయతకు బలమైన, చైతన్యవంతమైన భావనకు ప్రతీకగా తనైరా భావిస్తుంది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని చీరను డిజైన్ చేయడం మాకెంతో ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ శారీరన్ కార్యక్రమం కేవలం చీర, చీరకట్టు రమ్యతను గురించి తెలియజేసేందుకు మాత్రమే కాదు అధునిక జీవన విధానానికి అనుగుణంగా మా నిబద్ధతను పునర్నిర్వచించుకోవడం కోసం కూడా.
సంప్రదాయ చీరకట్టులోనూ చైతన్యవంతంగా, చురుగ్గా కనిపించవచ్చుననీ, తమ అస్తిత్వాన్ని వదులుకోకుండానే మనసుకు నచ్చినట్లుగా కూడా జీవించవచ్చునన్న సందేశాన్ని వ్యాప్తి చేయాలన్నదే ఈ శారీరన్‌ను నిర్వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అలాగే చీరకట్టు అనేది సాంస్కృతిక వారసత్వానికి, శక్తి సామర్థ్యాలకు వెన్నుదన్ను అని మా విశ్వాసం, నమ్మకం కూడా. చిన్న స్థాయిలో స్థానికంగా మొదలైన మా కార్యక్రమం నేడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారటం సంతోషంగా ఉంది’’ అన్నారు అంబుజ్ నారాయణ్.
(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!)
Comments
Please login to add a commentAdd a comment