ఎయిర్‌టెల్ మారథాన్
సిటీ.. రన్‌కు సిద్ధమైంది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటలకు మొదలయ్యే ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల రన్నర్‌లు, విదేశీయులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకు వేలాదివుంది తరలివచ్చారు. టీ షర్ట్‌లు, బూట్లు, గూడీ, బ్యాగ్‌లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన రన్నర్ల దగ్గర సలహాలు, సూచనలు తీసుకున్నారు.
బ్లేడ్ రన్నర్స్ కూడా పరుగో పరుగు అంటున్నారు. వూరథాన్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,500 వుంది వాలంటీర్లు సేవలందించనున్నారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. వురోవైపు ‘సోల్స్ ఫర్ సూల్స్’లో భాగంగా సేకరించిన బూట్లను హైదరాబాద్ రన్నర్స్ పంపిణీ చేశారు.
ఫుల్ మారథాన్ (42.195 కి.మీ):
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర మొదలవుతుంది. సంజీవయ్యుపార్క్, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్, శ్రీనగర్ కాలనీ బస్టాప్, బీకేఆర్ పార్క్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, హెచ్‌సీయూ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం దగ్గర వుుగుస్తుంది.
హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు):
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, హైటెక్ సిటీ, ఐఐఐటీ జంక్షన్ మీదుగా సాగి గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. ఇక 5కే రన్ గచ్చిబౌలి స్టేడియుంలో ఉదయుం 8 గంటలకు మొదలవుతుంది.
- వాంకె శ్రీనివాస్