ఈచ్ వన్ టీచ్ వన్
ఒక్క క్లిక్‌లో ప్రజలందరికీ ప్రపంచ స్థాయి సేవలు అందించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో ఎయిర్‌టెల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ, ఇంటర్‌నెట్‌పై అవగాహన కల్పించేలా గురువారం మెగా ఈవెంట్... ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఎయిర్‌టెల్ ఉద్యోగులు ఇందుల భాగస్వాములవుతారు. తమ పనులను పక్కనబెట్టి రోజంతా వాడవాడలా తిరిగి ఇంటర్‌నెట్ గురించి ప్రజలకు వివరిస్తారని ఎయిర్‌టెల్ ఏపీ, తెలంగాణ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్‌రాఘవన్ చెప్పారు. ఈ కార్యక్రమం గురించి
ఆయన మాటల్లోనే...
సామాజిక సేవలో మా వంతు బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 17 వేల మంది సంస్థ ఉద్యోగులు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని 600 మంది ఉద్యోగులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ కలిపి దాదాపు 25 వేల మంది ఈ మెగా ఈవెంట్‌లో భాగస్వాములవుతున్నారు. నగరంలోని 110 లొకేషన్‌సకు వెళ్లి క్యాంపెయిన్ నిర్వహిస్తారు.
అందరికీ అందుబాటులో...
స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికే కాదు, సాధారణ మొబైల్స్ వాడే సామాన్యులకు కూడా ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఎయిర్‌టెల్ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. సరైన అవగాహన లేక చాలా మంది నెట్‌ను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి
అవగాహన పెంచి ‘డిజిటల్
లిటరసీ’ని ప్రమోట్ చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఉద్యోగులు... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బస్తీలు తదితర ప్రాంతాల్లోని దాదాపు 1.2 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుస్తారు. ఇంటర్‌నెట్ వాడకం, దాని ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం బహుశా ఇదే తొలిసారి. సాధ్యమైనంత మందికి ఇంటర్‌నెట్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా కదులుతున్నాం.
ఇటీవల ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ‘వన్ టచ్ ఇంటర్‌నెట్’ పోర్టల్ ఉద్దేశం కూడా ఇదే. సినిమాలు, పాటలు, సామాజిక సైట్లే కాదు... టికెట్ బుకింగ్, ఈ కామర్స్ వంటి అన్నింటికీ వన్ స్టాప్ షాప్ ఈ పోర్టల్.
ఈవెంట్: ఈచ్ వన్ టీచ్ వన్
ప్రారంభం: బేగంపేట్ ఎయిర్‌టెల్ ప్రధాన కార్యాలయం
సమయం: ఉదయం 10.30 గంటలకు