వరుస మారథాన్‌లు నింపిన స్ఫూర్తో... ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహనో... మొత్తానికి సిటీజనులు ‘రన్ మంత్రం’ జపిస్తున్నారు. తెలతెలవారుతుండగానే... నిద్దర వుత్తు వదిలించుకొని పరుగు పెడుతున్నారు. పార్కులు, స్టేడియూలు.. రహదారులు, నగరంలో ఇప్పుడు ఉదయుం వేళల్లో ఏ దిక్కు చూసినా రన్.. రన్. ఈ ఉత్సాహాన్ని వురింత పెంచి ఆరోగ్యానికి బాటలు వేస్తోంది ‘హైదరాబాద్ రన్నర్స్ క్లబ్’.
‘ఆరోగ్యం కోసం పరుగెత్తండి’... ఇదీ హైదరాబాద్ రన్నర్స్ నినాదం. చిన్నారుల నుంచి సీనియుర్ సిటిజన్ల వరకు రన్నింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ... ఏడేళ్లుగా వూరథాన్‌లో భాగస్వావుులు చేస్తోంది. పరుగెత్తాలనే కోరిక ఉంటే చాలు... ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు... పూర్తిస్థారుు అథ్లెట్లుగానూ వూర్చేందుకు వివిధ విభాగాల్లో తర్ఫీదునిస్తోంది. ప్రతి మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ శిక్షణ ఉంటుంది. ఇంటర్‌వెల్, స్టెప్స్, హిల్, టెంపో, బిగినర్స్, లాంగ్ రన్స్ ఇలా ఆరు విభాగాల్లో తర్ఫీదు ఉంటుంది.
ఇంటర్వెల్ ట్రైనింగ్...
ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్, గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది. క్రీడాకారులందరు ఉదయం 5.30 గంటలకు కలుసుకుంటారు. ఆ తర్వాత మైదానంలో పరుగు ప్రాక్టీసు చేయిస్తారు. 400, 1,600 మీటర్ల ట్రాక్‌పై పరుగెత్తుతారు. దీని వల్ల స్పీడ్ పెరుగుతుంది.
స్టెప్స్ ట్రైనింగ్...
ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో కొహీమామ్ దర్గా వద్ద ఉదయం 5.45 గంటలకు స్టెప్స్ ట్రైనింగ్ ప్రాక్టీసు ప్రారంభిస్తారు. ఇదే రోజు విస్పర్‌వ్యాలీ (జూబ్లీహిల్స్ నుంచి టోలీచౌకి వెళ్లేదారిలో) వద్ద హిల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉదయం 5.30 గంటలకు రన్నర్‌లు కలుసుకుంటారు. మెట్లు ఎక్కడంతో పాటు ఎత్తరుున ప్రాంతాల్లో పరుగు పెట్టడం నేర్పిస్తారు. స్టామినా పెరిగేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది.
టెంపో రన్...
ప్రతి శుక్రవారం నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కులో టెంపోరన్ శిక్షణ ఉంటుంది. నిర్ధిష్ట సమయంలో ఎలా పరుగెత్తాలనే దానిపై శిక్షణ ఇది. మొదట రెండు కిలోమీటర్లు మెల్లగా పరుగెత్తి ఆ తర్వాత మూడు కిలోమీటర్లకు వేగం పెంచేలా క్లాస్‌లు (ఉదయుం 5.30 గంటలు) ఉంటాయి. స్పీడ్ పెంచుకొనేందుకు ఈ తర్ఫీదు ఉపయోగపడుతుంది.
బిగినర్ రన్నర్స్...
ప్రతి శనివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో కొత్తగా పరుగు నేర్చుకునే వారికి శిక్షణ ఇస్తారు.
ఉదయుం 5.30కి సెషన్ మొదలవుతుంది. ఇందులో సీనియర్లు అనుభవాలు పంచుకొంటారు.
సలహాలు ఇస్తారు. దీంతోపాటు ఐదు కిలోమీటర్ల పరుగు ఉంటుంది.
లాంగ్ రన్...
ప్రతి ఆదివారం లాంగ్ రన్ ఉంటుంది. 20 నుంచి 30 కిలో మీటర్ల పరుగులో శిక్షణ ఇది. వారానికో లొకేషన్. వూరథాన్‌లో పాల్గొనాలనుకొనేవారికి ఈ రన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చేరాలంటే...
ఔత్సాహికులు గూగుల్స్ గ్రూప్‌లోని హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్‌లో చేరాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడీకి ట్రైనింగ్ క్లాస్‌ల సమాచారం ఎప్పటికప్పుడు క్లబ్ ప్రతినిధులు పంపుతుంటారు. లాంగ్ రన్ లొకేషన్‌తో పాటు మరింత శిక్షణ సమాచారం కోసం https://www.facebook.com/HyderabadRunners, https://plus.google.com-/u/0/103766043627029140678/posts, https://twitter.com/ hydrunners లో అప్‌డేట్ పోస్ట్‌లు చూడవచ్చు.
- వాంకె శ్రీనివాస్
రెడీ రన్
Published Wed, Sep 10 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement