Marthan
-
Berlin: మారథాన్‌లో కిప్‌చోగె కొత్త ప్రపంచ రికార్డు
కెన్యా దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ చాంపియన్ ఎలీడ్ కిప్‌చోగె మారథాన్‌లో తన పేరిట కొత్త ప్రపంచ రికార్డును లిఖించుకున్నాడు. ప్రతిష్టాత్మక బెర్లిన్ మారథాన్‌లో 37 ఏళ్ల కిప్‌చోగె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 1 నిమిషం 9 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2018 బెర్లిన్ మారథాన్‌లోనే 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును కిప్‌చోగె సవరించాడు. చదవండి: Julius Baer Generation Cup: రన్నరప్ ఇరిగేశి అర్జున్.. -
ఢిల్లీ మహిళ ప్రపంచ రికార్డు... కాలినడకనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా..
Golden Quadrilateral Run: ఇంతవరకు మనం ఎంతో మంది సాధించిన ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. తమదైన నైపుణ్యం, ప్రతిభను కనబర్చి సాధించినవారు కొందరూ. మరికొంతమంది వినూత్న ఆవిష్కరణలతో రికార్డులు సృష్టించారు. అచ్చం అలాంటి కోవకు చెందిందే ఢిల్లీకి చెందిన ఈ మహిళ. వివరాల్లోకెళ్తే...ఢిల్లీకి చెందిన సుఫియా అనే అల్ట్రా రన్నర్ డిసెంబర్ 16, 2020న దేశ రాజధాని నుంచి తన పరుగును ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలను కలిపే జాతీయ రహదారుల నెట్వర్క్ అయిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ (బంగారు చతుర్భుజం)ని చుట్టి వచ్చింది ఈ 35 ఏళ్ల అథ్లెట్. ఆమె 6 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని సుమారు 110 రోజుల 23 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేసింది. నిజం చెప్పాలంటే ఇది అత్యంత సాహసోపేతమైన ప్రయాణం. ఆమె ఒక దశలో ప్రయాణాన్ని విరమించుకోవాలనుకుంది. అంతేకాదు ఆమెకు ఈ ప్రయాణంలో ఎన్నో గాయాలయ్యాయని అయినప్పటికీ తన లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించానని చెబుతోంది. తాను ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పరుగును తన భర్త మద్దతుతోనే పూర్తి చేయగలిగానని చెప్పింది. అంతేకాదు ఈ ప్రయాణంలో తనతో దాదాపు అన్ని నగరాల్లోని రన్నర్లు, సైక్లిస్టులు చేరారని తెలిపింది. ఈ ప్రయాణంలో తనకి కొంతమంది ప్రజలు ఆతిధ్యం ఇచ్చారని, ఒక్కోసారి రోడ్డు పక్కన షెల్టర్‌లోనే పడుకోవలసి వచ్చిందని చెపింది. ఈ మేరకు ఆదివారం ఆమె గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్న తర్వాత ఈ రికార్డును ధృవీకరించారు. అంతేకాదు ఆమె గతంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా (87 రోజులు, 2 గంటలు, 17 నిమిషాలు; ఏప్రిల్ 25-జూలై 21, 2019) - తన పేరుతో మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సుఫియా తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పూర్తి సమయం అల్ట్రా రన్నింగ్‌లో మునిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. It a Guinness World Records and It's Officially Amazing!!🏆🏆🏆 SUFIYA KHAN is Fastest female to run along The Indian Golden Quadrilateral Road (6002km in 110 days 23 hours) Congratulations Sufiya Khan!!💪💪💪🥇🥇🥇 🇮🇳🇮🇳🇮🇳#guinessworldrecord#girlpower #womenpowerment pic.twitter.com/w88kJIOBpP — Mohammad Mohsin I.A.S (@mmiask) March 28, 2022 (చదవండి: విచిత్రమైన ఫిర్యాదు...మోదీ ఫోటో తీసేయమని బెదిరింపులు) -
రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 5k రన్
-
హైదరాబాద్ లో 5కె రన్
-
ఉత్సాహంగా మారథాన్ 5కే రన్..
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 5కే రన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఈ రోజు నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో ఈ (5కే రన్, 10కే రన్) మారథాన్ కార్యక్రమం జరుగనుంది. రేపు (ఆదివారం) హైటెక్ నుంచి గచ్చిబౌలి వరకు 10కే రన్ నిర్వహించనున్నారు. యువతీ యువకులతో పాటు పలువురు ప్రముఖులు మారథాన్ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ మారథాన్‌లో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, అందరికీ మారథాన్‌పై అవగాహన కల్పించాలంటూ పలువురు ఔత్సాహికులు అభిప్రాయపడ్డారు. కాగా, మారథన్ రన్‌కు 'సాక్షి' మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది. -
ఉత్సాహంగా మారథాన్ 5కే రన్..
-
మూడేళ్ళలో అరవై కిలోలు తగ్గిన శ్రేయాస్...
ప్రతిభావంతులు, సేవా తత్పరులు, రాజనీతిజ్ఙులు ఇలా ప్రత్యేకతలు కలిగిన పలువురి జీవితాలను స్ఫూర్తిగా తీసుకుంటాం. కానీ ఆధునిక కాలంలో అతి పెద్ద సమస్యగా మారిన ఊబకాయులు కూడ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకు శ్రేయాస్ కర్నాడ్ పెద్ద ఉదాహరణ. శ్రేయాస్ తన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత స్వయంగా... ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తూ అందరికీ ఆదర్శమౌతున్నాడు ఇరవై ఏళ్ళ వయసుకూడ పూర్తికాని శ్రేయాస్ కర్నాడ్ 2009 లో 120 కిలోల బరువుండేవాడు. ఊబకాయంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. డాక్టర్లు, వైద్యాలు ఒక్కటేమిటి రకరకాలుగా బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేశాడు. తనలా ఊబకాయంతో ఎవ్వరూ బాధపడకూడదన్నది శ్రేయాస్ ఆకాంక్ష. అందుకు తాను ఎంతైనా కష్టపడేందుకు నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లే వారి వారి ఆరోగ్యాలకు సహాయపడతాయనేందుకు శ్రేయాస్ పెద్ద ఉదాహరణగా నిలిచాడు. ఓ ట్రైనర్ ప్రోత్సాహంతో 2009 నాటికి కేవలం మూడేళ్ళలో 62 కిలోలకు చేరి అందరికి స్ఫూర్తిగా నిలిచాడు. 2009 లో కడుపులో గ్యాస్, కిడ్నీల్లో రాళ్ళు, కాలేయంలో కొవ్వు వంటి ఇబ్బందులేకాక, రక్తశుద్ధిలేక రకరకాల చర్మవ్యాధులతో కూడ బాధపడేవాడు. వీటన్నింటికీ తన శరీర బరువే కారణమని తెలుసుకున్నాడు. ఆహారపు అలవాట్లతో శరీరంలో జింగ్ ఎక్కువ పెరిగిపోవడంతో రకరకాల ఇబ్బందులకు గురయ్యాడు. ఆరోగ్యంగా బతకాలంటే... శరీరంలో కొవ్వు తగ్గిస్తే తప్పించి మరో దారి లేదని డాక్టర్లు కూడ చెప్పేశారు. కేవలం 22 ఏళ్ళ వయసులో భారీ కాయంతో నానా తంటాలు పడ్డాడు శ్రేయాస్. 2010 లో బరువు తగ్గేందుకు జిమ్ లో చేరిన శ్రేయాస్.. పోషకాహారం తీసుకుంటూ అనేక వ్యాయామాలు చేశాడు. కొవ్వును, బరువును పెంచే అన్ని పదార్థాలను తినడం మానేశాడు. పండ్లు, కూరగాయలు, సలాడ్లు, చక్కెర లేని రసాలు తీసుకోవడం ప్రారంభించాడు. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చినా శ్రేయాస్ కు అంత ఫలితం కనిపించలేదు. ఇక లాభం లేదనుకొని ఓ ట్రైనర్ ను సంప్రదించి మూడు నెలలపాటు శిక్షణ తీసుకున్నాడు. అదే అతడి జీవితంలో పెద్ద మార్పును తెచ్చి పెట్టింది. ప్రతిరోజు 70 శాతం కార్డియో, 30శాతం బరువుకు సంబంధించిన ఫిట్నెస్ కార్యక్రమం మొదలు పెట్టాడు. మొదట్లో ట్రెడ్మిల్ పై నాలుగడుగులు వేసేందుకు కూడ శరీరం సహకరించక ఇబ్బంది పడ్డాడు. అయితే పట్టుదల వీడకుండా అనుకున్నది సాధించేందుకు తీవ్ర కృషి చేశాడు. చివరికి ఒకరోజు 30 నిమిషాల్లో పది కిలోమీటర్లు ట్రెడ్మిల్ పై నడక సాగించాడు. తాను సాధించిన దానికి తానే ఆశ్చర్యపోయాడు. అక్కడినుంచీ వెనుదిరిగి చూడకుండా ప్రతిరోజూ కొంత సమయాన్ని పెంచుతూ 2011 నాటికి పది కిలోమీటర్ల దూరం 50 నిమిషాల్లో చేయగలిగాడు. తన ప్రయత్నంతోపాటు 120 కేజీలనుంచీ 80 కేజీలకు బరువు కూడ తగ్గిపోయాడు. ఆ తర్వాత నడకకు తోడు పరుగును కూడ ప్రారంభించాడు. మారథాన్ అంటే ఏమిటో పూర్తిగా తెలియకుండానే, ఎటువంటి శిక్షణా లేకుండానే 2011 లో మొదటిసారి ఆరుగంటలపాటు మారథాన్ చేసిన శ్రేయాస్... ఆ తర్వాత పలు రకాలుగా పరుగును కొనసాగించాడు. దీనికి తోడు తన రోజువారీ షెడ్యూల్ లో యోగాను కూడ చేర్చాడు. అంతేకాదు కొంతకాలం పూర్తిగా శాకాహారిగా మారడంతో కూడ బరువు భారీగా తగ్గిపోయాడు. చివరిగా 2012 నాటికి మూడు సంవత్సరాల్లో 120 నుంచీ 57 కేజీల బరువు తగ్గి 62 కేజీలకు చేరాడు. అదే స్ఫూర్తితో శ్రేయాస్.. 2012 నుంచి సుమారు 50 మారథాన్లలో పాల్గొన్నాడు. దేశంలోనే కాక, ఇతర దేశాల్లో కూడ అనేక సైక్లింగ్ కార్యక్రమాల్లో ముందున్నాడు. వచ్చే సంవత్సరంలో అల్ట్రా మారథాన్స్ లో పట్టా కూడ పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే మనాలి నుంచి లేహ్ వరకు సైకిల్ టూర్... పశ్చిమ కనుమలు, పశ్చిమ తీరంద్వారా సైక్లింగ్ చేయడంతో పాటు... యూ.ఎస్ లోని అప్పలచియన్ ట్రయల్, హాంకాంగ్ లో అల్ట్రా ట్రయల్ మారథాన్, యూరప్ లోని కొన్ని భాగాల్లో సైక్లింగ్ చేసేందుకు సిద్ధమౌతున్నాడు. అయితే తన కథ ఎందరో ఊబకాయులకు స్ఫూర్తిగా నిలవాలని, బరువు తగ్గి అంతా ఆరోగ్యంగా జీవించాలని శ్రేయాస్ ఆశిస్తున్నాడు. -
రెడీ రన్
వరుస మారథాన్లు నింపిన స్ఫూర్తో... ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న అవగాహనో... మొత్తానికి సిటీజనులు ‘రన్ మంత్రం’ జపిస్తున్నారు. తెలతెలవారుతుండగానే... నిద్దర వుత్తు వదిలించుకొని పరుగు పెడుతున్నారు. పార్కులు, స్టేడియూలు.. రహదారులు, నగరంలో ఇప్పుడు ఉదయుం వేళల్లో ఏ దిక్కు చూసినా రన్.. రన్. ఈ ఉత్సాహాన్ని వురింత పెంచి ఆరోగ్యానికి బాటలు వేస్తోంది ‘హైదరాబాద్ రన్నర్స్ క్లబ్’. ‘ఆరోగ్యం కోసం పరుగెత్తండి’... ఇదీ హైదరాబాద్ రన్నర్స్ నినాదం. చిన్నారుల నుంచి సీనియుర్ సిటిజన్ల వరకు రన్నింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ... ఏడేళ్లుగా వూరథాన్లో భాగస్వావుులు చేస్తోంది. పరుగెత్తాలనే కోరిక ఉంటే చాలు... ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. కేవలం ఆరోగ్యం కోసమే కాదు... పూర్తిస్థారుు అథ్లెట్లుగానూ వూర్చేందుకు వివిధ విభాగాల్లో తర్ఫీదునిస్తోంది. ప్రతి మంగళ, గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఈ శిక్షణ ఉంటుంది. ఇంటర్వెల్, స్టెప్స్, హిల్, టెంపో, బిగినర్స్, లాంగ్ రన్స్ ఇలా ఆరు విభాగాల్లో తర్ఫీదు ఉంటుంది. ఇంటర్వెల్ ట్రైనింగ్... ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌లోని ఆర్ఆర్సీ గ్రౌండ్, గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది. క్రీడాకారులందరు ఉదయం 5.30 గంటలకు కలుసుకుంటారు. ఆ తర్వాత మైదానంలో పరుగు ప్రాక్టీసు చేయిస్తారు. 400, 1,600 మీటర్ల ట్రాక్‌పై పరుగెత్తుతారు. దీని వల్ల స్పీడ్ పెరుగుతుంది. స్టెప్స్ ట్రైనింగ్... ప్రతి గురువారం సికింద్రాబాద్‌లో కొహీమామ్ దర్గా వద్ద ఉదయం 5.45 గంటలకు స్టెప్స్ ట్రైనింగ్ ప్రాక్టీసు ప్రారంభిస్తారు. ఇదే రోజు విస్పర్‌వ్యాలీ (జూబ్లీహిల్స్ నుంచి టోలీచౌకి వెళ్లేదారిలో) వద్ద హిల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉదయం 5.30 గంటలకు రన్నర్లు కలుసుకుంటారు. మెట్లు ఎక్కడంతో పాటు ఎత్తరుున ప్రాంతాల్లో పరుగు పెట్టడం నేర్పిస్తారు. స్టామినా పెరిగేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. టెంపో రన్... ప్రతి శుక్రవారం నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కులో టెంపోరన్ శిక్షణ ఉంటుంది. నిర్ధిష్ట సమయంలో ఎలా పరుగెత్తాలనే దానిపై శిక్షణ ఇది. మొదట రెండు కిలోమీటర్లు మెల్లగా పరుగెత్తి ఆ తర్వాత మూడు కిలోమీటర్లకు వేగం పెంచేలా క్లాస్‌లు (ఉదయుం 5.30 గంటలు) ఉంటాయి. స్పీడ్ పెంచుకొనేందుకు ఈ తర్ఫీదు ఉపయోగపడుతుంది. బిగినర్ రన్నర్స్... ప్రతి శనివారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో కొత్తగా పరుగు నేర్చుకునే వారికి శిక్షణ ఇస్తారు. ఉదయుం 5.30కి సెషన్ మొదలవుతుంది. ఇందులో సీనియర్లు అనుభవాలు పంచుకొంటారు. సలహాలు ఇస్తారు. దీంతోపాటు ఐదు కిలోమీటర్ల పరుగు ఉంటుంది. లాంగ్ రన్... ప్రతి ఆదివారం లాంగ్ రన్ ఉంటుంది. 20 నుంచి 30 కిలో మీటర్ల పరుగులో శిక్షణ ఇది. వారానికో లొకేషన్. వూరథాన్లో పాల్గొనాలనుకొనేవారికి ఈ రన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చేరాలంటే... ఔత్సాహికులు గూగుల్స్ గ్రూప్‌లోని హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్‌లో చేరాలి. ఇలా రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడీకి ట్రైనింగ్ క్లాస్‌ల సమాచారం ఎప్పటికప్పుడు క్లబ్ ప్రతినిధులు పంపుతుంటారు. లాంగ్ రన్ లొకేషన్‌తో పాటు మరింత శిక్షణ సమాచారం కోసం https://www.facebook.com/HyderabadRunners, https://plus.google.com-/u/0/103766043627029140678/posts, https://twitter.com/ hydrunners లో అప్డేట్ పోస్ట్‌లు చూడవచ్చు. - వాంకె శ్రీనివాస్ -
వేస్ట్ వారీయర్స్
ఆదివారం ఉదయం.. మారథాన్‌లో వేల మంది హైదరాబాదీలు పరుగులు తీస్తుంటే.. వారిని అనుసరిస్తూ మీడియా కెమెరాలు, ఉత్సాహపరుస్తూ రోడ్డుకిరువైపులా సిటీజనులు.. అయితే ఈ సందడికి దూరంగా చేతిలో డిస్పోజబుల్ బ్యాగ్స్ పట్టుకుని కొందరు తమ పని చేసుకుపోయారు. 20 చెక్పాయింట్ల దగ్గర నుంచుని వీరు చేసిన పని.. ఈ ఈవెంట్ పుట్టించిన కిలోల కొద్దీ వేస్ట్‌ని సేకరించడం, దానిని సమర్థంగా మేనేజ్ చేయడం.. ఇంతకూ వారెవరు? వేస్ట్ వారియర్స్! -ఎస్.సత్యబాబు ‘గచ్చిబౌలి స్టేడియం చాలా విశాలంగా, అందంగా ఉంది. కానీ ఇక్కడ సరైన వేస్ట్ డిస్పోజబుల్ సిస్టమ్ లేదు. ఈ ప్రాంతంలో కొంతకాలం క్రితం జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్తను తగలబెట్టడం చూసి షాక్ తిన్నాం. అలాంటి పనులు పర్యావరణానికి చేటు చేస్తాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు జోడి అండర్హిల్ అనే బ్రిటిష్ వనిత. ఈ వేస్ట్ వారియర్స్ వ్యవస్థాపకురాలు ఆ మహిళే. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని వేస్ట్ పని పట్టిన వాలంటీర్లకు స్ఫూర్తి ఈమే. 2008 డిసెంబర్లో జోడి ఇండియా వచ్చారు. టూరిస్ట్‌గా దేశంలో పర్యటించే సమయంలోనే వేస్టేజ్ సమస్య గుర్తించారు. ఓ ఏడాది తర్వాత రంగంలోకి దిగారు. ధర్మశాలలోని దలైలామా ఇంటిని ఆమె తొలిసారి శుభ్రపరిచారు. ఈ పనిలో ఓ వందమంది ఆమెకు తోడయ్యారు. పరిశుభ్ర భారత్‌ను తానొక్కదాన్నే కాదు.. ఇంకెందరో కోరుకుంటున్నారని అప్పుడామెకు అర్థమైంది. వెంటనే సేవే లక్ష్యంగా మౌంటైన్ క్లీనర్స్ సంస్థ ప్రారంభించారు. మారుమూల కొండప్రాంతం ట్రిండ్లో పని మొదలు పెట్టారు. ప్రస్తుతం అత్యంత శుభ్రమైన పర్వత ప్రాంతంగా ట్రిండ్ మారిందంటే అది జోడి అండ్ కో పుణ్యమే. అలా చెత్త ఏరివేసే ఈ యాక్టివిటీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇండియాలోని పర్యాటక ప్రాంతాలన్నింటినీ క్లీన్ అండ్ నీట్‌గా మార్చాలన్న వారి సంకల్పంతో 2012లో వేస్ట్ వారియర్స్ అవతరించింది. సిటీకి పరిచితులే.. ఈ సంస్థకు సిటీలో శాశ్వత సభ్యులున్నారు. 200 మంది విద్యార్థులు మారథాన్ క్లీనింగ్‌లో పాల్గొన్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్, సెయింట్ పీటర్స్, ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, రూట్స్ బిజినెస్ స్కూల్స్, ఐసీబీఎమ్, ఎన్ఐటీహెచ్ఎమ్, ఎమ్జే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. వంటి విద్యాసంస్థల విద్యార్థులు ఈ పనిలో పాల్గొన్నారు. ‘గతేడాది కూడా మా టీమ్ హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొంది. అప్పుడు సేకరించిన వేస్టేజ్‌లో 98 శాతం ఈ బృందం సమర్థవంతంగా రీసైకిల్ చేసింది. ఈసారి మారథాన్‌లో రన్నర్ల సంఖ్య బాగా పెరిగింది. వేస్టేజ్ కూడా రెట్టింపు పోగైంది. 3 డీసీఎంలు నిండాయ’ని జోడి చెప్పారు. 42 కిలోమీటర్ల మారథాన్ మార్గాన్ని శుభ్రపరచడం అంత సులభమైన విషయం కాదన ్న జోడి.. ఈ పనిలో సిటీ యూత్ సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఆ నమ్మకం ఉంది.. హైదరాబాద్‌లో వేస్ట్ డిస్పోజల్ అనే కాన్సెప్ట్ ఇంకా విస్తరించాల్సి ఉందంటారు బృంద సభ్యురాలు, సిటీవాసి శ్వేత దండపాణి. ‘చాలా మందికి వేస్ట్ డిస్పోజల్ అంటే చెత్త కుప్పలో వేయడం వరకు మాత్రమే తెలుసు. వేస్టేజ్ తగ్గించడం, రీసైకిల్‌పై అవగాహన కల్పిస్తున్నామ’ని తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌లు, సన్‌బర్న్ వంటి ఈవెంట్లలో పని చేసిన అనుభవం వేస్ట్ వారియర్స్‌కు ఉంది. పరిశుభ్రమైన హైదరాబాద్‌ను చాలామంది కోరుకుంటున్నారని తెలిపిన జోడి.. వచ్చే ఏడాది మారథాన్ ఈవెంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ మరింత సక్సెస్ అవుతుందంటున్నారు. -
కర్టసీ షూపుదాం
ఒక ఆలోచన పరిస్థితులను మార్చే ప్రయత్నం చేస్తుంది.. నలుగురు కలసి నడిస్తే.. దారిలో ఒకరి ఇబ్బంది మరొకరిని కదిలిస్తుంది. సామూహిక చైతన్యంగా మారి.. ఇంకొందరికి చేయూతనిస్తుంది. అందరూ కలసి ఒకటిగా అడుగేస్తే.. తడబడు అడుగులు కూడా పరుగెత్తుతాయి. ఇలాంటి ఆలోచనే హైదరాబాద్ రన్నింగ్ సభ్యులకు వచ్చింది. ఏటా నిర్వహించే మారథాన్ పరుగు పందెంలో షూలు లేకుండా పరుగెత్తుతున్న వారి కోసం.. ఓ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది. మారథాన్.. ఈ సుదీర్ఘ పరుగుపందెంలో పాల్గొనేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. అందులో ఉన్నవారే కారు.. లేనివారు ఉంటారు. ఈ పందెంలో రంగురంగుల బూట్లతో పరుగెత్తే వారే కాదు.. షూలు లేకుండా పాల్గొనే వారు కూడా క నిపిస్తారు. సామాజిక స్పృహ నింపే వేదికగా ఉన్న మారథాన్‌లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని హైదరాబాద్ రన్నింగ్ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకోసమే పాత షూ జోళ్లను సేకరించడం మొదలుపెట్టారు. యూజ్ అండ్ డొనేట్.. నగరంలో షూ వాడకం పెరిగిపోయింది. ఎమ్ఎన్సీల రాకతో కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తోంది. ప్రపంచ పోకడలకు తగ్గట్టు ముస్తాబవుతూ.., ఏటా షూలను మార్చేసే కుర్రకారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కొత్త బూట్ల రాకతో.., పాతవాటిని బయట పడేయడం ఇష్టం లేక.. ఇంట్లో దాచుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వీరికిప్పుడో పరిష్కారం చూపుతోంది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్. ఇంట్లో వృథాగా పడిఉన్న బూట్లను కొన్ని మరమ్మతులు చేసి అవసరమైన వారు వినియోగించే మార్గాన్ని ఏర్పాటు చేసింది. టార్గెట్ యూత్.. సామాజిక అనుసంధాన వేదిక ప్రచారంతో పాటు యువత ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తున్నారు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ సభ్యులు. మూడేళ్లుగా పాత షూలు సేకరిస్తున్నారు. ఈ సారి కూడా కళాశాల విద్యార్థులు, ఆన్లైన్ వేదికతో పాటు నగరంలోని షాపర్స్ స్టాప్ సూపర్ మార్కెట్, రిలయన్స్ ఫుట్ ప్రింట్లలోనూ ‘పాత షూ సేకరణ’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన బూట్లను మారథాన్‌లో పాల్గొనే బూట్లు లేనివారికి అందించనున్నారు. మిగతా వాటిని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిరుపేద విద్యార్థులకు అందించేలా ప్లాన్ చేశారు. కాస్త పనికొచ్చినా ఓకే.. పనికొచ్చే ఏ తరహా షూ జోళ్లనైనా తీసుకుంటాం. మారథాన్‌లో షూ లేకుండా వచ్చేవారికి అందిస్తాం. మిగిలిన వాటిని డాన్‌బాస్కో ఎన్జీవో, వివేకానంద విద్యా వికాస కేంద్రం, ఓం సాయి సేవాశ్రమానికి చేరవేస్తాం. ఇతర నగరాల నుంచి మారథాన్‌లో పాల్గొనేవారు పరుగు ముందురోజు కిట్ పొందే ఎక్స్‌పోలో ఇస్తే సరిపోతుంది. - నవీన్, హైదరాబాద్ రన్నర్ సభ్యుడు విస్తృత ప్రచారం.. యువతరం ఎక్కువగా వచ్చే స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్, రిలయన్స్ ప్రింట్స్‌లలో షూ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. కళాశాలల్లోనూ వీటి సేకరణకు సంబంధించి ప్రచారాన్ని మొదలుపెట్టాం. ఈ సేకరణలో ఐదు విద్యాసంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. - జయభారతి, హైదరాబాద్ రన్నర్ మెంబర్ కలెక్షన్ పాయింట్లు ఇవే.. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్, సెయింట్ మేరీస్. ముఫకం జా కాలేజి, రూట్ బిజినెస్ స్కూల్, ఐసీబీఎం బిజినెస్ స్కూల్ స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్ ముషీరాబాద్, గచ్చిబౌలి, అత్తాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట రిలయన్స్ ఫుట్‌ప్రింట్స్ సోమాజిగూడ, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, మదీనాగూడ, కార్ఖానా, ఏఎస్రావు నగర్ - వాంకె శ్రీనివాస్ -
ఫ్యామిలీతో రన్‌డి
ఆగస్టు.. మిగిలినవారికి పన్నెండు నెలల్లో మరో నెల కావచ్చు. కానీ సిటీలోని పరుగు వీరులకు మాత్రం ఇది ప్రత్యేకమైన నెల. ప్రపంచవ్యాప్తంగా మారథాన్ ఈవెంట్లు మొదలయ్యేది ఆగస్టు నుంచే. అందుకే, ఇప్పుడు పరుగు వీరులు పవర్‘ఫుల్’గా సమాయత్తమవుతున్నారు. సిటీలోనే కాదు.. దేశ విదేశాల్లో జరిగే మారథాన్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ఉత్సాహానికి నిర్వాహకుల ప్రోత్సాహం కూడా తోడవుతోంది. అందుకే.. మీరే కాదు, ఫ్యామిలీని కూడా తీసుకురండి అంటూ ఆహ్వానం పంపుతున్నారు. దీంతో చాలా ఫ్యామిలీలు కొత్త ట్రెండ్ వైపు పరుగు తీస్తున్నాయి. మేమిద్దరం.. మాకిద్దరు సిటీలో 2011లో జరిగిన మారథాన్‌లో వాలంటీరుగా సేవలందించాం. ఇదే స్ఫూర్తితో చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ మారథాన్‌లో పిల్లలు మాయ (13), ఆదిత్య (9)తో కలసి పాల్గొని పతకాలు సాధించాం. హిమాలయాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే సాంగ్లాలో మా పిల్లలు దాదాపు పది కిలోమీటర్ల మేర పరుగు తీశారు. అమెరికాలోని ఇండియానా పోలిస్ హాఫ్ మారథాన్లోనూ అందరం పాల్గొన్నాం. - విశ్వనాథ్, శ్రీలత పరుగులో అన్నా‘దమ్ము’లు కేవలం మూడు నెలల ప్రాక్టీసుతోనే హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. తర్వాత ముంబై, పాండిచ్చేరిలోని అరోవిలే, కోయంబత్తూర్ మారథాన్లలో పాల్గొన్నాం. దేశంలో అతిపెద్ద మారథాన్‌లో దాదాపు 30 వేల మంది పాల్గొన్నారు. అక్కడ పరుగు తీసే సమయంలో ఒకే బ్రిడ్జి వస్తుంది. హైదరాబాద్‌లోనైతే ఎన్నో బ్రిడ్జిలు, కొండలు, వంపుల మధ్య పరుగు తీయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్ దీనిని సమర్థంగా నిర్వహిస్తోంది. - నవీన్, జానకీరాం గ్రీకులు, పర్షియన్ల నడుమ మారథాన్‌లో జరుగుతున్న యుద్ధంలో.. గ్రీకుసేనల విజయవార్తను చేరవేసేందుకు ఒక గ్రీకు దూత మారథాన్ నుంచి ఏథెన్స్కు పరుగు పరుగున వచ్చాడు. ‘మనం గెలిచాం’ అని చెబుతూనే అతడు ప్రాణాలు విడిచాడు. అతడి జ్ఞాపకార్థం మారథాన్ ఈవెంట్ సంప్రదాయంగా మారింది. మారథాన్ పరుగు నిర్ణీత దూరం 42.195 కి.మీ. (26 మైళ్ల 218 గజాలు). దీనిని పూర్తి చేసేందుకు కనీసం 4 గంటల నుంచి గరిష్టంగా 6.30 గంటల వ్యవధి నిర్ణయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 500 మారథాన్లు జరుగుతున్నాయి. బోస్టన్, న్యూయార్క్, బెర్లిన్, షికాగో, లండన్, లాస్ ఏంజెలిస్ వంటి నగరాల్లో జరిగే మారథాన్లు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. మన దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏటా మారథాన్లు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రపంచస్థాయిలో టాప్-10 మారథాన్లను గుర్తించి, పురస్కారాలు కూడా ఇస్తున్నాయి. ఏడేళ్ల క్రితం.. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నగరంలో ఏడేళ్ల కిందట మారథాన్లకు శ్రీకారం చుట్టింది. ‘అప్పట్లో పాల్గొన్నవారి సంఖ్య వెయ్యికి లోపే. ఈ ఏడాది మేం పదివేల మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’ అని సిటీలోని రన్నర్స్ క్లబ్ ప్రతినిధి జై భారతి అంటున్నారు. స్వల్పకాలంలోనే భారత్‌లో రెండో అతి పెద్ద మారథాన్‌గా పేరు సంపాదించింది హైదరాబాద్. సిటీలోనే కాదు, దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడ మారథాన్ ఈవెంట్ జరిగినా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే హాబీగా మారడం విశేషం. అలాగే నిర్వాహకులు కూడా సిటీ ఫ్యామిలీలకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపడం సంప్రదాయం. గిన్నిస్‌బుక్’లోకి దంపతుల రన్... నా భర్త కృష్ణప్రసాద్, నేను ఇరవైకి పైగా మారథాన్లలో పాల్గొని, నగరంలోనే అత్యధిక మారథాన్లలో పాల్గొన్న ఘనత దక్కించుకున్నాం. మంచుతో నిండిన ఉత్తర ధ్రువ ప్రాంతంలో నిర్వహించిన మారథాన్లోనూ పాల్గొన్నాం. ఏడు నెలల వ్యవధిలోనే ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ మారథాన్లలో పాల్గొన్నందుకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కించుకున్నాం. - చిగురుపాటి ఉమ, జూబ్లీహిల్స్ పతకాల కోసమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా... రెండేళ్ల కిందట హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నాం. అదే స్ఫూర్తితో చెన్నైలో పాల్గొన్నాం. ఆ తర్వాత నాసిక్ మారథాన్‌లో సెకండ్ రన్నర్స్‌గా నిలిచాం. గోవా, ఆరోవెల్లి, ముంబై మారథాన్లలోనూ పాల్గొన్నాం. మా అమ్మాయి తాన్యా గోవాలో జరిగిన 10కే రన్లో పాల్గొంది. పతకాల కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా మారథాన్‌లో పరుగు తీస్తున్నాం. - శర్వాణి, శ్యామ్ - ఎస్.సత్యబాబు/వాంకె శ్రీనివాస్