
ఉత్సాహంగా మారథాన్ 5కే రన్..
హైటెక్ సిటీలోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైన 5కే రన్ మారథాన్ ముగిసింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన 5కే రన్ మారథాన్ ఉత్సాహంగా సాగింది. ఈ రోజు నుంచి రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో ఈ (5కే రన్, 10కే రన్) మారథాన్ కార్యక్రమం జరుగనుంది. రేపు (ఆదివారం) హైటెక్ నుంచి గచ్చిబౌలి వరకు 10కే రన్ నిర్వహించనున్నారు.
యువతీ యువకులతో పాటు పలువురు ప్రముఖులు మారథాన్ కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ మారథాన్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, అందరికీ మారథాన్‌పై అవగాహన కల్పించాలంటూ పలువురు ఔత్సాహికులు అభిప్రాయపడ్డారు. కాగా, మారథన్ రన్‌కు 'సాక్షి' మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది.