ఫిట్.. పర్‌ఫెక్ట్ | Apollo Hospital, Jubilee Hills, she participated in a meeting held on campus | Sakshi
Sakshi News home page

ఫిట్.. పర్‌ఫెక్ట్

Published Fri, Mar 13 2015 3:28 AM | Last Updated on Thu, Apr 4 2019 5:42 PM

ఫిట్.. పర్‌ఫెక్ట్ - Sakshi

ఫిట్.. పర్‌ఫెక్ట్

బిడ్డకు జన్మనిచ్చాక కూడా మహిళలు చక్కని ఫిజిక్ సాధించడం సాధ్యమేనని అంతర్జాతీయ స్థాయి ఫిట్‌నెస్ ట్రైనర్ రమోనా బ్రగాంజా అన్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘నా మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. మా పేరెంట్స్ నేను పుట్టక ముందే భారత్ నుంచి కెనడా వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. మూడేళ్ల క్రితం భారత్‌కు వచ్చా. మరోసారి ఇలా రావడం ఆనందంగా ఉంది’ అన్నారు. సిటీవాసులకూ అందుబాటులో...
 
అపోలో లైఫ్ నిర్వాహకురాలు ఉపాసన కామినేని మాట్లాడుతూ... ‘జెస్సికా అల్బా, హల్లీబెర్రీ, అన్నాహాత్‌వే తదితర హాలీవుడ్ నటులకు శిక్షకురాలిగా రమోనా పేరొందారు. వారందరికీ విజయవంతంగా శిక్షణనిచ్చి... వారి ఫిజిక్‌లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆమె సేవలు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉంది. నేను కూడా కొంత కాలంగా రమోనా సూచనలు తీసుకొంటున్నా.

ఇకపై ఆమె శిక్షణలో నా ఫిజిక్ మరింతగా మెరుగవుతుందని ఆశిస్తున్నా. మహిళలందరూ స్వయంశక్తితో ఎదగాలని కోరుకుంటూ ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఫిట్‌నెస్ ట్రైనర్లుగా మరింత మంది మహిళలు రావాలనేది నా ఆకాంక్ష’ అని చెప్పారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలోని అపోలో లైఫ్  ఫిట్‌నెస్ సెంటర్‌లో రమోనా గురువారం నుంచి నెల రోజులపాటు శిక్షణ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement