టెక్సాస్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్ లో 5కే రన్/1కే ఫన్ వాక్, ఫుడ్ డ్రైవ్ లను నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా మన తెలుగువారిలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తోంది. ఇందులో వారిని భాగస్వాములను చేసేందుకు ఈ కార్యకమాన్ని 2014 నుంచి నిర్వహిస్తూ వస్తుంది. డల్లాస్-ఫోర్టువర్తు మెట్రో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి దాదాపు 100 మందికి పైగా ఈ రేసులో పాల్గొన్నారు. ఫిటెనెస్ కోసం పరుగులు పెట్టే వారంతా 5కె రన్‌లో పాల్గొంటే.. ఆరోగ్యం కోసం 1కే ఫన్‌లో సరదాగా నడస్తూ ఉత్సాహంగా పోటీ పడ్డారు.
ఈ పరుగు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రేస్ బిబ్స్ ను అందించడం జరిగింది. దీని ఆధారంగా వారు 5K రన్ పూర్తి చేయటానికి తీసుకున్న సమయం, వారి వయోపరిమితి ఆధారంగా తీసుకోవడంతో పాటు మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారిని విజేతలుకు పతకాలను అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల ఈ రన్ విజయవంతం కావడానికి తన వంతు సహకారం అందించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలను అందిస్తున్న అందరికి చాప్టర్ కోఆర్డినేటర్ సత్య శ్రీరామినేని ధన్యవాదాలు తెలిపారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్ 2 కుక్, హిండ్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజ్నిక్స్ ఫార్మాస్యూటికల్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాల్వేషన్ ఆర్మీ కోసం నాట్స్ ఫుడ్ డ్రైవ్ నాట్స్ ప్రతి ఏటా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఫుడ్ డ్రైవ్ కూడా డల్లాస్ నాట్స్ విభాగం ఈ 5కే రన్తో పాటు నిర్వహించింది. ఈ ఫుడ్ డ్రైవ్ కి కూడా మన తెలుగు వారి నుంచి విశేష స్పందన లభించింది. దీని ద్వారా విరాళంగా వచ్చిన ఆహారాన్ని డల్లాస్‌లోని స్థానిక సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా అందించారు. డల్లాస్ టీం క్రీడా విభాగ నాయకులు గౌతం కాశిరెడ్డి, నాట్స్ డల్లాస్ చాప్టర్ కో-కోర్డినేటర్ రవి తాండ్ర, డల్లాస్ టీం సభ్యులు శ్రీథర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, శ్రీనివాస్ ఉరవకొండ, త్రినాథ్ పెద్ది, యషిత, రేహాన్, సందీప్ తాతినేనితో పాటు ఇతర సభ్యులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ డల్లాస్ విభాగం చేపట్టిన రన్, ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా క్రీడా విభాగ సభ్యులకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment