‘తూర్పు’న ‘రన్’ సందడి | run movie hulchul in adrsha collage | Sakshi
Sakshi News home page

‘తూర్పు’న ‘రన్’ సందడి

Published Sun, Mar 20 2016 3:02 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

‘తూర్పు’న ‘రన్’ సందడి - Sakshi

‘తూర్పు’న ‘రన్’ సందడి

‘ఆదర్శ’ విద్యార్థులతో హీరో సందీప్ కిషన్ డాన్స్

 ‘రన్’ జోడీ సందడి..
ఈ నెల 23న విడుదల కానున్న ‘రన్’ సినిమా హీరోహీరోరుున్లు సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ శనివారం జిల్లాలో సందడి చేశారు. చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో కలిసి చిందేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలంతో ముడిపడ్డ విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం విజయవంతం కాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

గొల్లప్రోలు : చిత్ర ప్రచారంలో భాగంగా రన్ చిత్రం యూనిట్ శనివారం జిల్లాలో సందడి చేసింది. యూనిట్ సభ్యులకు చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ బుర్రా అనుబాబు, అనురాధ దంపతులు ఘన స్వాగతం పలి కారు. చిత్రం హీరో, హీరోయిన్‌లు సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్ విద్యార్థులతో హుషారుగా  డాన్స్‌లు చే శారు. ్రపత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్‌పై హీరో సందీప్‌కిషన్ విద్యార్థులతో ముచ్చటిం చారు. తాను కూడా నాలుగేళ్లక్రితం మీ  లాంటి విద్యార్థినేనని, ఎవరైనా  సెలబ్రిటీ వస్తే  కేరింతలు కొట్టే వాడినని  తెలిపారు. ప్రస్తుతం తాను సెలబ్రిటీలా మీ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మంచి కథతో రన్ చిత్రం తీశామన్నారు. ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి ప్రేమలో ఎదుర్కొన్న సంఘనలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. టైం పై ఆధారపడి సినిమా నడుస్తుందన్నారు. హీరోయిన్ అనీషా మాట్లాడుతూ సినిమాలో తన పాత్ర ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. 

 హీరో హీరోయిన్లను చూసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.  డెరైక్టర్ అనిల్ కనిగంటి, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర పాల్గొన్నారు.

సరికొత్త కథతో ‘రన్’
కాకినాడ కల్చరల్ : సరికొత్త కథాంశంతో రూపొందించిన ‘రన్’ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని చిత్ర కథానాయకుడు సందీప్‌కిషన్ అన్నారు. స్థానిక సరోవర్ పోర్టుకో హోటల్‌లో చిత్ర యూనిట్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు సందీప్‌కిషన్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నూతన కాన్సెప్ట్‌తో  రూపొందించామన్నారు. మానవుని నిజ జీవితంతో ‘కాలం’ (టైమ్) ఏవిధంగా చెలగాటమాడుతుందనే ప్రధానాంశంతో ఈ చిత్రం తీశామన్నారు. హాస్యం, ఉత్కంఠతో కథ కొనసాగుతుందన్నారు. కథానాయిక  అనితా అంబ్రోస్ చక్కటి నటనను ప్రదర్శించిందన్నారు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ చిత్రం ముందస్తు ప్రభారంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తమ యూనిట్ త్వరలో ‘ఒక అమ్మాయితో’ అనే చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement