2కే రన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్
ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి
కోడ్ ఉల్లంఘనలపై ‘సి విజిల్’యాప్‌లో ఫిర్యాదు చేయండి
ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు.
బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్
బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment