vikasraj
-
తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నందున పోలింగ్ అధికారులు, పోలీస్‌లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఓటర్ల ను ప్రలోభ పెట్టకుండా అడ్డుకట్ట వేయాలని, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. డబ్బు, మద్యం, డ్రగ్స్, బహుమతులు ఉచిత పంపిణీకి ఎక్కువ అవకాశం ఉన్న మురికి వాడల్లో, బస్తీల్లో నిఘా పెంచాలని సూచించారు.మ్యారేజీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వీటి పంపిణీకి అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు. ఎన్నికల సమాయత్తంపై సీఈఓ వికాస్‌రాజ్ శుక్రవారం రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వí ßæంచారు. ఈనెల 13న పోలింగ్ జరగనున్న రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించా రు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నట్టు తెలిపారు.వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయండికేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆప రేటింగ్ ప్రొసీజర్స్) ప్రకారం అంతర్ జిల్లా సరి హద్దులు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఈఓ సూచించారు. వాహనాలను తనిఖీలు చేయాలన్నా రు. కలెక్టర్లు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో శాంత్రిభద్రతల అంశాలకు సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల సమక్షంలో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.సోషల్ మీడియాను మానిటర్ చేయాలిసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వార్తలు ప్రచారం కాకుండా సోషల్ మీడియాను మానిటర్ చేయాలని వికాస్‌రాజ్ సూచించారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా పరిష్కరించేలా ఈసీఐఎల్ ఇంజినీర్లను ముందస్తు గా అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశించారు.ఈవీఎంలు, వీవీ పాట్ల తరలింపులో జరభద్రంపోలింగ్ తర్వాత ఈవీఎంలు, వీవీపాట్లను స్ట్రాంగ్ రూంలకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని వికాస్‌రాజ్ సూచించారు. ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తీసుకువచ్చేప్పుడు, తిరిగి వాటిని స్ట్రాంగ్ రూంలకు తెచ్చేటప్పుడు, భద్రపర్చి నప్పుడు వీడియో తీయడంతోపాటు సీసీటీవీ ల ద్వారా రికార్డ్ చేయాలన్నారు. ఈ అన్ని సందర్భాల్లో అభ్యర్థులు, రాజకీయపార్టీల ప్రతినిధులు తప్పక ఉండేలా చూడాలన్నారు. సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ నియో జకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటెన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ సమయం గంట పెంచినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములు గు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్త గూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగుస్తుందన్నారు. -
ఫేక్ వీడియోలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫేక్ వీడియోల సర్క్యులేషన్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్ వీడియోల ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47 శాతం పూర్తయిందని, మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానా లకు తావు ఉండదన్నారు.ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950లోక్‌సభ ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొననున్నారని వికాస్ రాజ్ వెల్లడించారు. ఏడు లోక్‌సభస్థానాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, 9 స్థానాల్లో 2 బ్యాలెట్ యూని ట్లు వాడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనపు బ్యాలెట్ యూనిట్లు రప్పిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్‌కేంద్రాల వద్ద ఎండ తగలకుండా టెంట్లు..షెడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన టోల్ ఫ్రీ నంబరు ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్లైన్లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లురాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్లు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.పోలింగ్‌శాతం పెంచాలని..పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. 5 వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం రికార్డు అవుతున్నట్టు గుర్తించామన్నారు. పోలింగ్ సమయంలో సెక్టార్ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియ నిదానంగా జరిగినా, తక్కువ పోలింగ్ నమోదవుతున్నా వెంటనే అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దు్దతారన్నారు. 5, 6 తేదీల్లో హోం ఓటింగ్ఇంటి వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు 23,248 మంది దరఖాస్తులను ఆమోదించినట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో వయోవృద్ధులు 10,362 మంది, దివ్యాంగులు 11,032 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఓటర్లు 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6న వీరికి వారి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికి 7,185 కేసులు7185 కేసులు నమోదు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఆబ్కారీ శాఖ 6560 కేసులు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కింద 287 కేసులు, ఐపీసీ కేసులు 309, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. రూ. 81 కోట్లు నగదు, రూ.46 కోట్లు విలువైన లిక్కర్, రూ. 26 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.27 కోట్లు విలువ చేస్తే ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.212 కోట్ల విలువైన నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్‌రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్‌రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్‌లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్‌లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
తెలంగాణలో రీపోలింగ్‌కు అవకాశమే లేదు: సీఈవో వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ మూడో తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధానంపై సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ స్క్రూటినీ ముగిసిన తర్వాత సీఈవో వికాస్‌రాజ్ వివరాలు వెల్లడించారు. ‘తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారు. తెలంగాణలో 71.01 శాతం పోలింగ్ జరిగింది. లక్షా 80వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్ జరిగింది. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. 2018లో పోలింగ్ 73.37 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్టు తెలిపారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ తగ్గింది. తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్ నమోదు అయినట్టు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ కల్పించాం. ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది’ దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది. పోలింగ్‌పై స్క్రూటినీ ఇవ్వాళ ఉదయం నుంచి జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది. లెక్కింపు జరిగినా కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎంలు లెక్కిస్తారు. ప్రతీ రౌండ్‌కు సమయం పడుతుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 ఉన్నాయి. ప్రతీ టేబుల్‌కు ఐదుగురు ఉంటారు. కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాము’ అని అన్నారు. -
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్‌లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
ముగిసిన ప్రచార గడువు, అమల్లోకి నిషేధాజ్ఞలు, 144 సెక్షన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా మంగళవారం రాత్రి మొదలు నిరంతర పర్యవేక్షణ పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగుతుంది. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఆదేశించాం. ప్రతి ఫిర్యాదుపై దగ్గర్లోని వీడియో సర్వేలన్స్ బృందాలు వెళ్లి విచారణ చేస్తాయి.’అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకల పంపిణీని కట్టడి చేసేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా 24్ఠ7 పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. అన్ని చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా కంట్రోల్ రూమ్స్ నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లను మంగళవారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. స్థానికేతరులందరూ వెళ్లిపోవాలి... ఎన్నికల ప్రచారానికి తెరపడిందని, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని వికాస్ ప్రకటించారు. రాజకీయ, ప్రచార కార్యక్రమాలపై నిషేధాజ్ఞలతో పాటు 114 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులందరూ నియోజకవర్గాలను విడిచి తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రతి పార్టీ నిషేధాజ్ఞలు పాటించాలి నిషేధాజ్ఞలను అనుసరించాలనీ, టీవీ, సినిమా, రేడియో వంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదనే నిబంధనలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు వికాస్‌రాజ్ సూచించారు. ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఉంటుందన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధ గంట వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించరాదని స్పష్టం చేశారు. ఎల్రక్టానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వరాదన్నారు. మీడియా సర్విఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆమోదంతోనే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయాలని సూచించారు. బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ మెసేజేస్లపై నిషేధం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పార్టీల స్టార్ క్యాంపైనర్లు పత్రికా సమావేశాలు పెట్టరాదని, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని స్పష్టం చేశారు ఈవీఎంల తరలింపును ఫాలో కావచ్చు.. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించడం, మొబైల్ ఫోన్స్, కార్డ్‌లెస్ ఫోన్లు, వాహనాలతో రావడంపై నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్ తెలిపారు. అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకుని రావడం, తీసుకెళ్లడం కోసం వాహనాలను సమకూర్చడం నేరమని హెచ్చరించారు. ఈవీఎంల మూడో ర్యాండమైజేషన్ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేందాలకు బుధవారం ఉదయం పోలింగ్ సిబ్బంది వచ్చాక వారికి ఈవీఎంలను ఇచ్చి పోలింగ్ కేంద్రాలకు పంపిస్తారన్నారు. పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఈవీఎంలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో అభ్యర్థుల ఏజెంట్లు తమ వాహనాల్లో ఫాలో కావచ్చని సూచించారు. నిర్దేశిత రూట్లలోనే ఈవీఎంలను రవాణా చేయాల్సి ఉంటుందని, మధ్యలో ఎక్కడా ఆగకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు అభ్యర్థి ఒక వాహనం వాడడానికి మాత్రమే అనుమతిస్తామని, ఏజెంట్‌కు మరో వాహనం అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు పంపిణీ చేసే ఓటర్ స్లిప్పుల్లో అభ్యర్థి పేరు, రాజకీయ పార్టీ గుర్తు ఉండరాదన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదు.. పోలింగ్ రోజు మాక్ పోల్ కోసం అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం 5.30 గంటలకి పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సీఈఓ వికాస్‌రాజ్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు మాక్‌పోల్ నిర్వహించిన తర్వాత వీవీ ప్యాట్ కంపార్ట్మెంట్ను ఖాళీ చేయాల్సి ఉంటుందని, కంట్రోల్ యూనిట్ మెమోరీని సైతం డిలీట్ చేయాలన్నారు. ఏజెంట్లు ఈవీఎంల వద్దకి వెళ్లరాదని, లేనిపక్షంలో ప్రిసైడింగ్ అధికారులు వారిని బయటికి గెంటివేస్తారన్నారు. పోస్టల్ బ్యాలెట్లో విఫలం కాలేదు.. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పనలో విఫలమైనట్టు వచ్చిన ఆరోపణలను వికాస్‌రాజ్ తోసిపుచ్చారు. ఇంటి నుంచి ఓటేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 94శాతం మందికి సదుపాయం కల్పించామన్నారు. 27,178 మంది ఇంటి నుంచే ఓటేయగా, వారిలో 15,999 మంది 80ఏళ్లుపైబడినవారు, 9459 మంది దివ్యాంగులు, 1720 మంది అత్యవసర సేవల ఓటర్లున్నారని వెల్లడించారు. మరో 10,191 మంది సర్విసు ఓటును ఎల్రక్టానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్నారని, డిసెంబర్ 3న ఉదయం 7.59 గంటలకు అవి సంబంధిత కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న మరో 1.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సంబంధిత నియోజకవర్గానికి పంపించేందుకు గచ్చిబౌలి స్టేడియంలో ఎక్ఛేంజ్ కేంద్రం పెట్టామని ఆయన వివరించారు సెక్టోరియల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు... ప్రతి నియోజకవర్గం పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఒక్కో సెక్టోరియల్ అధికారిని నియమించామని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి చర్యలు తీసుకుంటారని వికాస్‌రాజ్ తెలిపారు. శాంతిభద్రతల సమస్యలొస్తే చర్యలు తీసుకునే మెజిస్టీరియల్ అధికారాలు వారికి ఉంటాయన్నారు. ఎక్కడైన ఈవీఎంలు పనిచేయని పక్షంలో తక్షణమే ప్రత్యామ్నాయ ఈవీఎంలను వారే సమకూర్చుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహమద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. పోలింగ్ రోజు సెలవు ప్రకటించకుంటే కఠిన చర్యలు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణఎన్నికల్లో ఓటేసేందుకు నవంబర్ 30న పోలింగ్ రోజు సెలవు ప్రకటించని ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ఆదేశించారు. గత శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్ రోజు కొన్ని ఐటీ, ఇతర ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించలేదని ఫిర్యాదులొచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ సారి ఎవరైనా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించని పక్షంలో కార్మిక చట్టంతో పాటు ఎన్నికల చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర కార్మిక శాఖకు మంగళవారం లేఖ రాశారు. -
ఒక్క బీఆర్ఎస్పైనే చర్యలు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క బీఆర్ఎస్ నేతలపైనే చర్యలు తీసుకుంటోందని.. ఇతర పార్టీల నేతలపై ఫిర్యాదులొచ్చినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి 72 ఫిర్యాదులురాగా.. రెండు మినహా అన్నింటిపై విచారణ జరిపి, కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలను పంపామని తెలిపారు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్లు సైతం నమోదు చేశామన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ పాటించాలంటూ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం జారీ చేసిన అడ్వైజరీ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, కార్యక్రమాల అమలు కోసం 10 రకాల అనుమతులు కోరగా, సీఈసీ 9 అనుమతులు ఇచ్చిందని, కేవలం ఒకే విజ్ఞప్తిని తిరస్కరించిందని వివరించారు. బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఐటీశాఖ జరిపిన తనిఖీల్లో ఏమీ లభించలేదని తెలిపారు. టీ–వర్క్స్ ప్రభుత్వ భవనంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఘటనపై ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కేటీఆర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం నాటికి వివరణ అందలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ శాసనసభ ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందని.. అప్పటి నుంచి పోలింగ్ ముగిసేవరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లోకి ఉంటుందని వికాస్‌రాజ్ చెప్పారు. ఈ సమయంలో టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో సైతం ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఆమోదించిన ప్రకటనలను మాత్రం వార్తాపత్రికల్లో జారీ చేయవచ్చని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైన ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వివిధ నియోజకవర్గాలకు వచ్చిన బయటి వ్యక్తులు సైలెన్స్ పీరియడ్ ప్రారంభమయ్యే సరికి వెళ్లిపోవాలన్నారు. ఎన్నికల కోసం ఈవీఎంలను సిద్ధం చేశామని, ఇతర ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. పోలింగ్ సమీపించిన నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై దాడులను మరింత ఉధృతం చేయాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించమన్నారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ వివరాలివీ.. ♦ శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ♦ మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ♦ ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎౖMð్సజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ♦ కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
అఫిడవిట్లతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రంలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలులో అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అఫిడవిట్లకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే సమర్పించాలని స్పష్టం చేశారు. అఫిడవిట్‌లోని అన్ని కాలమ్స్ తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాల సమర్పణలో పొరపాట్లుంటే నామినేషన్ తిరస్కరిస్తామని, అందుకు అభ్యర్థే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, కానీ ఒకదానికి మాత్రమే డిపాజిట్ చెల్లుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్ రాష్ట్రంలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ గంట కుదించడం జరిగిందని సీఈఓ తెలిపారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగుతుందని, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. రైతుబంధుపై ప్రతిపాదనలు రాలేదు.. ప్రగతిభవన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి వివరణ వచ్చిందని, ఆ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రైతుబంధు పథకం కింద లబ్దిదారులకు సాయం అందజేతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదన్నారు. కోడ్ ఉల్లంఘనలపై 137 కేసులు ఫైల్ చేశామని, ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13, కాంగ్రెస్ 16, బీజేపీ 5, బీఎస్పీకి సంబంధించి 3 కేసులు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీల భద్రత జిల్లా ఎస్పీలు పర్యవేక్షిస్తారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం 4 నెలలుగా దాదాపు 22 శాఖలతో సమావేశాలు నిర్వహిస్తోందని, అందులో ఐటీ శాఖ కూడా ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శాఖ లు బాధ్యతతో పనిచేస్తున్నాయని వివరించారు. తొలిసారిగా పెద్దసంఖ్యలో యువ ఓటర్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరిందని, ఇందులో పురుషులు 1.609 కోట్లు, మహిళలు 1.608 కోట్లు ఉన్నారని సీఈఓ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన నవంబర్ 10వ తేదీలోగా పూర్తి చేస్తామన్నారు. 18–19 సంవత్సరాల మధ్య ఉన్న ఓటర్లు 9.10 లక్షల మంది ఉన్నారని, ఇంత పెద్ద సంఖ్యలో యువ ఓటర్లుండడం ఇదే తొలిసారి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లున్నాయని, ఇందులో పట్టణ ప్రాంతంలో 14,458, గ్రామీణ ప్రాంతాల్లో 20,898 ఉన్నాయన్నారు. ఓటర్లకు ముందస్తుగానే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు అందజేస్తామని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.453.93 కోట్లు సీజ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.453.93 కోట్లు సీజ్ చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు. రూ.165.43 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.43.86 కోట్ల విలువైన వాహనాలు, కుక్కర్లు, చీరలు, సెల్ఫో న్లు తదితర వస్తువులు సీజ్ చేశామన్నారు. నగదు రవాణాకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రత్యే కంగా రూపొందించిన నిబంధనలు పాటించా లని సూచించారు. సీజ్ చేసిన ప్రతి రూపాయికి రసీదు ఇవ్వడం జరుగుతుందని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 362 కేసులు నమోదు చేయగా, 256 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. 2,928 బైండోవర్లు ఉన్నాయని, 7,460 ఆయుధాలు డిపాజిట్ చేశామని తెలిపారు. నాన్‌బెయిలబుల్ వా రెంట్లు 238 జారీ చేశామని, ఇప్పటివరకు సీ విజిల్‌కు 2,487, 1950 నంబర్‌కు 437 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు. -
ఆ పల్లెను చూసింది నలుగురు ఎమ్మెల్యేలే!
రాష్ట్రంలో అంతరించిపోతున్న ఆదిమ జాతుల్లో ఒకటైన కొండరెడ్లకు ఓటు హక్కు కల్పించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ఈ ఏడాది కొత్తగా 71 మంది కొండరెడ్లు ఓటుహక్కు పొందారు. సమాజానికి దూరంగా అడవుల్లో నివసించే కొండరెడ్లను సైతం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడంపై జిల్లా యంత్రాంగం చేసిన కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ సైతం అభినందించారు. దీంతో ఒక్కసారిగా కొండరెడ్లు ఫోకస్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలపై కొండరెడ్ల జీవన స్థితిగతులతో పాటు అక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. దట్టమైన అడవిలో..: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ – దమ్మపేట మార్గంలోని దట్టమైన అటవీ మార్గంలో ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఒక ఫారెస్ట్ చెక్ పోస్టు వస్తుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేని కాలిబాటలో 13 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. . కొండరెడ్లు నివాసముండే పూసుకుంట అనే గ్రామం వస్తుంది. ఇక్కడ 138 మంది కొండరెడ్లు నివసిస్తున్నారు. ఇందులో 80 మందికి గతంలో ఓటుహక్కు ఉండగా ఈ ఏడాది కొత్తగా 14 మందికి ఓటుహక్కు వచ్చింది. ఆ గ్రామం చూసిన ఎమ్మెల్యేలు నలుగురే..: గడిచిన డెబ్బై ఏళ్లుగా ఈ గ్రామాన్ని సందర్శించింది కేవలం నలుగురు ఎమ్మెల్యేలే. వారే జలగం ప్రసాదరావు, తుమ్మల నాగేశ్వరరావు, వగ్గేల మిత్రసేన, తాటి వెంకటేశ్వర్లు. కొండ రెడ్ల ఓట్లు తక్కువగా ఉండటం, ఇతరులతో కలవకుండా వేరుగా నివసిస్తుండడంతో బడా నేతలు కానీ రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదు. ఎన్నికల వేళ కేవలం ఓటర్లుగానే పరిగణిస్తున్నారు తప్ప అరుదైన గిరిజన జాతిగా గుర్తించడం లేదు. ఫలితంగా ఈ జాతి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గవర్నర్ రాకతో..: రాష్ట్ర గవర్నర్ తమిళసై 2022 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ప్రధాన రహదారి నుంచి 13 కి.మీ దూరంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆమె పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ గ్రామానికి ప్రభుత్వపరంగా వివిధ పక్కా భవనాలు మంజూరయ్యాయి. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ ఆటో సమకూర్చారు. అలాగే, ఇక్కడి ప్రజలకు వెదురుతో అలంకరణ వస్తువులు తయారు చేయించడంపై శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ సౌకర్యాలు మూణ్నళ్ల ముచ్చటే..: గవర్నర్ రాకతో హడావుడిగా వచ్చిన సౌకర్యాలు ఇప్పుడు మూలనపడ్డాయి. ఆర్వో ప్లాంట్‌లో వాటర్ ట్యాంక్ పగిలిపోగా, బ్యాటరీ ఆటో రిపేరుకు వచ్చింది. శిక్షణా కేంద్రానికి వేసిన తాళం తీయడం లేదు. వీటిపై ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. వెదురు బుట్టల మార్కెటింగ్‌పై దృష్టి సారించకపోవడంతో స్థానికులు వాటి తయారీపై ఆసక్తి చూపడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లదీ ఇదే పరిస్థితి. కొండ దిగినా..: డెబ్బై ఏళ్లుగా ప్రభుత్వాలు, ఐటీడీఏ చేసిన ప్రయత్నాలతో కొండలు దిగి కింద ఉన్న అడవుల్లో కొందరు గ్రామాలను ఏర్పాటు చేసుకుంటే మరికొందరు మైదాన ప్రాంతాల సమీపాన ఉండే అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరంగా వీరి కోసం అమలు చేసే పథకాల అమలులోనూ చిత్తశుద్ధి లోపించడంతో సరైన ఫలితాలు రావట్లేదు. దాంతో వారు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రమాదపుటంచున..: అడవుల్లో ఉండటం, జీవన విధానం, సంస్కృతి, ఆహారపు అలవాట్లు, వేషభాషల ఆధారంగా 1975లో దేశవ్యాప్తంగా ఆరుదైన ఆదిమజాతులను (ప్రిమిటీవ్ ట్రైబల్ గ్రూప్) ప్రభుత్వం గుర్తించింది. అయితే రానురానూ ఈ ఆదిమ జాతుల జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో అత్యంత ప్రమాదంలో ఉన్న ఆదిమ జాతులుగా పేరు మార్చారు. ఈ కేటగిరీకి చెందిన 12 రకాల ఆదిమ జాతులు ఉమ్మడి ఏపీలో ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నాలుగు రకాలైన ఆదిమ తెగలే ఉన్నాయి. 2018–19లో రాష్ట్ర గిరిజన శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలం (జనాభా 40 వేలు), తోటి (4 వేలు), నల్లమల్ల అడవుల్లో చెంచులు (16 వేల జనాభా)తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 వేల మంది కొండరెడ్లు ఉన్నట్టు తేలింది. తాజాగా ఓటర్ల జాబితాకు వచ్చేసరికి కొండరెడ్ల జనాభా సగానికి సగం తగ్గిపోయి కేవలం 1,054కే పరిమితమైంది. ఇందులో 692 మందికి ఓటు హక్కు ఉంది. వీరంతా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న ఏడు కొండరెడ్డి గూడెల్లో నివాసం ఉంటున్నారు. రోడ్డు కావాలి.. మా ఊరికి రోడ్డు కావాలని ఎప్పటి నుంచో చెబుతున్నాం. వర్షాకాలం వస్తే ఊరు దాటడం కష్టం. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే దేవుడే దిక్కు. నీళ్ల ప్లాంటు, అంబులెన్స్, ఆటోలు పని చేయడం లేదు. – ఉమ్మల దుర్గ, పూసుకుంట చదువు ఆపేశాను నాకు ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను, తమ్ముడు తొమ్మిదో తరగతితోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నాం. – ఇస్మాయిల్‌రెడ్డి, వీరారెడ్డిగూడెం -తాండ్ర కృష్ణగోవింద్ -
ఏఎస్డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు
ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా? వికాస్‌రాజ్: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్ 15లోగా పంపిస్తాం. నవంబర్ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు? పోలింగ్ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’తోపాటు ఈసీఐ వెబ్‌సైట్‌లోని ‘ఓటర్ సహాయ మిత్ర’ అనే లింక్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్ కేంద్రాలు మారొచ్చు. ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా పొందాలి? 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్మెంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు. ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని కవర్లో ఉంచి సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్ ఫెసిలిటేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించుకుంటాం. ప్రగతి భవన్లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్ సినిమా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా? ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్ తిరస్కరిస్తారా? అఫిడవిట్లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించరు. అన్ని కాలమ్‌లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్‌ను తిరస్కరించవచ్చు. నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి? త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా? యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి? ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. -
ఇక పక్కాగా అఫిడవిట్!
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్‌లోని ప్రతికాలమ్ను ఇకపై తప్పనిసరిగా పూరించాల్సిందే. కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత నమూనాలోని అఫిడవిట్లో పొందుపరచాల్సిందే. ఏ ఒక్క కాలమ్‌ను ఖాళీగా ఉంచినా సంబంధిత అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థి తన అఫిడవిట్లో ఏదైనా కాలమ్‌ను ఖాళీగా ఉంచినట్టు నిర్ధారిస్తే, సదరు అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేసి ఆ కాలమ్‌ను నింపాలని కోరుతారు. అయినా కాలమ్‌ను నింపడంలో విఫలమైతే ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నేరచరిత్రను పత్రికల్లో ప్రకటించాలి రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో అదనపు సీఈఓ లోకేష్‌కుమార్, పోలీసు నోడల్ అధికారి సంజయ్‌కుమార్ జైన్, జాయింట్ సీఈఓ సత్యవతితో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలని, నేర చరిత్ర గల అభ్యర్థులకు ఎందుకు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశంపై కారణాలు తెలుపుతూ రాజకీయ పార్టీలు సైతం పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇక ఈసీ పరిధిలోకి అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేశారని, వారు ఈసీకి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్టు పరిగణిస్తామని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటర్ల వివరాల మార్పు కోసం ఫారం 8 దరఖాస్తుల ïస్వీకరణకు గడువు ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆలోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓటర్లకు ఎన్నికల్లో ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో సోమవారం తర్వాత అందనున్న ఫారం–7 దరఖాస్తులను ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్‌లో పెడతామని వివరించారు. వారికి ఇంటి నుంచే ఓటు హక్కు దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్లకు తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఇందుకోసం ఫారం 12డీ దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. పోలింగ్ కేందాల్లో టాయిలెట్లు, తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్లతో పాటు ఈవీఎం బ్యాలెట్లలో సైతం అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలన కోసం తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని చెప్పారు. మీడియా సర్టిఫికేషన్ కమిటీ నుంచి ధ్రువీకరణ పొందిన తర్వాతే వాణిజ్య ప్రకటనలు జారీ చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. లెక్కలు చూపితే నగదు విడుదల... రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్తుంటే తనిఖీల్లో జప్తు చేస్తారని, ఆ నగదుకు సంబంధించిన లెక్కలను చూపిస్తేనే విడిచి పెడ్తారని వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు ముందుగా సమాచారమిచ్చి నగదును తరలిస్తే వారికి అనుమతి జారీ చేస్తామని వెల్లడించారు. పక్కాగా నిబంధనలు అమలు చేయాలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు(డీఈఓ), జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. రాష్ట్ర వ్యయ పరిశీలన నోడల్ అధికారి మహేశ్ భగవత్, కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి స్వాతి లక్రా, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్‌కుమార్ జైన్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలపాలని, వెబ్సైట్లలో సైతం ఆలస్యం చేయకుండా మార్పులు చేస్తుండాలని ఆదేశించారు. -
ఉపాధి హామీలో ఘన వ్యర్థాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా ప్రతి 1000 మంది జనా భాకు 5 లక్షల చొప్పున ఖర్చు పెడతారు. ఈ పనిలో పాలుపంచుకున్న పారిశుధ్య కార్మికులు ఎంత సమయం పని చేయాలి, వారికి ఎంత వేతనం చెల్లించాలనే వివరా లను ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఈ పనులకు నిధు లు సమకూర్చే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. -
ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా పరీక్షల్లో (సీ-05 స్కీమ్‌లో) ఫెయిల్ అయిన విద్యార్థులు మరోసారి పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ మంగళవారం జీవో జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఈ అవకాశాన్ని కలిస్తున్నామని, ఫెయిల్ అయిన సబ్జెక్టులను మళ్లీ రాయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.