చివరి అంకంలో అప్రమత్తంగా ఉండండి
ఎన్నికల అధికారులకు సీఈఓ వికాస్‌రాజ్ ఆదేశాలు
రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నందున పోలింగ్ అధికారులు, పోలీస్‌లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ఆదేశించారు. ఓటర్ల ను ప్రలోభ పెట్టకుండా అడ్డుకట్ట వేయాలని, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. డబ్బు, మద్యం, డ్రగ్స్, బహుమతులు ఉచిత పంపిణీకి ఎక్కువ అవకాశం ఉన్న మురికి వాడల్లో, బస్తీల్లో నిఘా పెంచాలని సూచించారు.
మ్యారేజీ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వీటి పంపిణీకి అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు. ఎన్నికల సమాయత్తంపై సీఈఓ వికాస్‌రాజ్ శుక్రవారం రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వí ßæంచారు. ఈనెల 13న పోలింగ్ జరగనున్న రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించా రు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నట్టు తెలిపారు.
వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయండి
కేంద్ర ఎన్నికల సంఘం ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆప రేటింగ్ ప్రొసీజర్స్) ప్రకారం అంతర్ జిల్లా సరి హద్దులు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులలో ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఈఓ సూచించారు. వాహనాలను తనిఖీలు చేయాలన్నా రు. కలెక్టర్లు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో శాంత్రిభద్రతల అంశాలకు సంబంధించి ఆయా జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల సమక్షంలో ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
సోషల్ మీడియాను మానిటర్ చేయాలి
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వార్తలు ప్రచారం కాకుండా సోషల్ మీడియాను మానిటర్ చేయాలని వికాస్‌రాజ్ సూచించారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా పరిష్కరించేలా ఈసీఐఎల్ ఇంజినీర్లను ముందస్తు గా అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశించారు.
ఈవీఎంలు, వీవీ పాట్ల తరలింపులో జరభద్రం
పోలింగ్ తర్వాత ఈవీఎంలు, వీవీపాట్లను స్ట్రాంగ్ రూంలకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని వికాస్‌రాజ్ సూచించారు. ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు తీసుకువచ్చేప్పుడు, తిరిగి వాటిని స్ట్రాంగ్ రూంలకు తెచ్చేటప్పుడు, భద్రపర్చి నప్పుడు వీడియో తీయడంతోపాటు సీసీటీవీ ల ద్వారా రికార్డ్ చేయాలన్నారు. ఈ అన్ని సందర్భాల్లో అభ్యర్థులు, రాజకీయపార్టీల ప్రతినిధులు తప్పక ఉండేలా చూడాలన్నారు.
సాయంత్రం 6 గంటల వరకు అవకాశం
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ నియో జకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటెన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ సమయం గంట పెంచినట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలిపారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములు గు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్త గూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజ కవర్గాల పరిధిలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఓటింగ్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment