
ఈయన పేరు కత్తెరశాల కొము రయ్య.. ఊరు ఖిలా వరంగల్.. శనివారం హనుమకొండలో జరిగిన 5కే రన్‌లో పాల్గొని.. ఏకంగా బంగారు పతకమే సాధించారు. ఇంతకీ ఇతని వయసు ఎంత నుకున్నా రు.. జస్ట్ 95 ఏళ్లు. ‘ఉదయం 5గంటలకు నా నడక ప్రారంభి స్తాను. 25 ఏళ్ల నుంచీ ఇదే నా దిన చర్య. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. ఇప్పుడీ వయసులో సొంతగడ్డపై జరిగిన ఈ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది’ అని కొమురయ్య అన్నారు.
– వరంగల్ స్పోర్ట్స్