సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారిపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను రిటైర్డ్ ఐఏఎస్ బృందం కోరింది. ఈ మేరకు విశ్రాంత ఐఏఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాల్ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు.
చదవండి : సీఎస్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల అధికారి, చీఫ్ సెక్రటరీలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఎన్నికల అధికారిని బెదిరించడం దారుణమన్నారు. తాము ఆత్మప్రభోదం ప్రకారమే పని చేస్తామని, తమ చర్యల వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని స్పష్టం చేశారు. తాము(ఐఏఎస్‌లు) నిజాయితీగా పనిచేయడం వల్లే వ్యవస్థ సక్రమంగా నడుస్తోందన్నారు. రాజకీయ లబ్థి కోసమే చంద్రబాబు నాయుడు అధికారులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment