సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో గత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు గత నెల 30న తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పంపారు. 2014లో కంభంపాటిని అప్పటి టీడీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే.
కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే పలువురు టీడీపీ నాయకులు మాత్రం ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment