
సాక్షి, అమరావతి : ఫొని తుపాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపారు. దీనిలో తుపాన్ ప్రభావం వల్ల 2 వేల విద్యుత్ స్థంభాలు, 117 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రానికి 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని నివేదికలో పేర్కొన్నారు. 553 హెక్టార్లలో పంటలు.. 520 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఫొని తుపాన్ వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభంవిచలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.