
అమరావతి: టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ విచారణ పూర్తి చేశారు. తిరుపతిలో టీటీడీ ఈవో, విజిలెన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను మన్మోహన్ విచారించారు. అనంతరం ఏపీ సచివాలయంలో ఏపీ సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో మన్మోహన్ భేటీ అయ్యారు. తిరుమల శ్రీవారి నగల తరలింపు ఆరోపణలపై సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంకు నివేదికను మన్మోహన్ సింగ్ అందజేశారు. బంగారం తరలింపు ఆరోపణలపై తన విచారణలో వెల్లడైన అంశాలను మన్మోహన్ సింగ్, సీఎస్‌కు వివరించారు.
టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై పలు అనుమానాలు కలగడంతో ఈ నెల 21న ఏపీ సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణాధికారిగా నియమించి ఈ నెల 23వ తేదీలోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు పంపిన విషయం తెల్సిందే.