
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు. నిపుణుల అభిప్రాయం తీసుకోకుండా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి సాఫ్ట్‌వేర్ తీసుకునేందుకు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అంగీకరించిందని లేఖలో పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీ నేతలు, వారి అనుచరులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్ల ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్ కంపెనీ సాఫ్ట్‌వేర్, పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరికరాల కొనుగోలు వెనక ఉన్న దురుద్దేశం బహిర్గతం కావాల్సి ఉందని, అందుకనే ఇజ్రాయెల్ కంపెనీకి చెల్లించాల్సిన రూ.12.5 కోట్ల బిల్లును నిలిపి వేయాలని కోరారు.
ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ సీఎస్‌కు రాసిన లేఖ
Comments
Please login to add a commentAdd a comment